News April 10, 2024
టీడీపీకి మరో కీలక నేత రాజీనామా?
AP: టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ నేత KE ప్రభాకర్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే సీటు దక్కలేదని ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. కుమారుడు రుద్ర ఒత్తిడితో అనుచరులతో కలిసి ప్రభాకర్ వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Similar News
News November 15, 2024
ఢిల్లీ గ్రేప్ ఆంక్షలు.. ఎలా డిసైడ్ చేస్తారు..?
ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) రూపొందించింది. వాయు కాలుష్య తీవ్రతను బట్టి దీన్ని 4 స్టేజ్‌లలో అమలు చేస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201-300 (పూర్): స్టేజ్ 1, AQI 301-400(వెరీ పూర్) ఉంటే స్టేజ్ 2 అమలు చేస్తారు. ప్రస్తుతం AQI 401-450(సివియర్) ఉండటంతో స్టేజ్ 3 ఆంక్షలు విధించింది. AQI 450 (సివియర్+) దాటితే చివరిదైన స్టేజ్ 4 ఆంక్షలు వస్తాయి.
News November 15, 2024
వారానికి 5 రోజుల పని మంచిది కాదు: నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి హార్డ్ వర్క్‌పై మరోసారి కామెంట్లు చేశారు. తాను రోజులో 14గంటలు కష్టపడేవాడినని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అభివృద్ధి చెందుతున్న ఇండియాలో 5రోజుల పని దినాల విధానం మంచిది కాదన్నారు. హార్డ్ వర్క్‌కు ప్రత్యామ్నాయం లేదని, మీరు అత్యంత తెలివైన వ్యక్తి అయినా కష్టపడాల్సిందేనని చెప్పారు. PM మోదీ వారానికి 100గంటలు పని చేస్తారని దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
News November 15, 2024
ఫైల్స్ దగ్ధం.. ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్‌పై అభియోగాలు
AP: మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో దస్త్రాల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 22ఎ అసైన్డ్ భూములపై కొందరు అక్రమంగా హక్కులు సాధించారని, ఆ ఆధారాలు ఉండొద్దనే రికార్డులు తగలబెట్టారని CID ప్రాథమిక నివేదికలో పేర్కొంది. దీనికి ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్‌ను బాధ్యులుగా గుర్తించిన ప్రభుత్వం వారిపై అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులిచ్చారు.