News October 30, 2025

ఆదిలాబాద్: పత్తిచెనులో పులి

image

భీంపూర్ మండలంలోని తాంసి(కే) గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం పులి సంచరిస్తోందని స్థానికులు తెలియజేశారు. దీంతో భయాందోళనలకు గురై పరుగులు తీయడం జరిగిందన్నారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు హైమద్ ఖాన్‌ను సంప్రదించగా.. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పరిసర ప్రాంతాల్లో పులి అడుగుల కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Similar News

News October 30, 2025

ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

తుపాన్ ప్రభావం కారణంగా కృష్ణా నది, నల్లమడ కాలువ అంచున ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గురువారం సూచించారు. ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. కృష్ణా నది వరద ముంపు ప్రమాదం ఉన్న రేపల్లె, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

News October 30, 2025

‘రామగుండం అభివృద్ధి.. గడువులోగా పూర్తి చేయండి’

image

RMGలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. RMG మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. TUFIDC సహా వివిధ పథకాల కింద జరుగుతున్న పనులను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ తదితర అధికారులు పాల్గొన్నారు.

News October 30, 2025

KNR: మొంథా తుఫాన్.. రైతన్నలకు మిగిల్చింది తడిసిన ధాన్యమే

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అధికారుల అంచనా ప్రకారం 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో తడిసి ముద్దయినట్లు సమాచారం. చేతికి వచ్చిన పంట అమ్ముకునే సమయంలో వర్షాలు పడి పంట నష్టాన్ని కలిగించిందన రైతులు వాపోయారు. రైతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించే సాయమే మిగిలిందని రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు.