News October 30, 2025
హీరో నారా రోహిత్ భార్య పల్నాడు వారే.!

హీరో నారా రోహిత్ వివాహానికి సీఎం చంద్రబాబు గురువారం హాజరుకానున్నారు. నారా రోహిత్ భార్య శిరీష లెల్ల పల్నాడు జిల్లాలోని రెంటచింతల గ్రామానికి చెందినవారు. ఆమెది ఒక సాధారణ రైతు కుటుంబం. సినిమా రంగంపై ఆసక్తితో ఆమె హైదరాబాద్‌కు వచ్చి, ఆడిషన్స్‌లో పాల్గొని, ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. వీరిద్దరూ పరస్పరం ఇష్టపడడంతో శిరీషను అదృష్టం వరించింది.
Similar News
News October 30, 2025
కేశంపేట: భారీ వర్షానికి పాడైన బొప్పాయి తోట

మొంథా తుఫాన్ ప్రభావంతో కేశంపేటలో వ్యవసాయం దెబ్బతింది. తొమ్మిదిరేకులకి చెందిన పంది రామ్ రెడ్డి 4 ఎకరాలలో బొప్పాయి పంటను సాగు చేస్తున్నాడు. కాత పూత దశలో ఉన్న బొప్పాయి భారీ వర్షానికి నేలకొరిగింది. రూ.లక్షల పెట్టుబడి పెడితే అంతా నాశనం అయ్యింది సదరు రైతు వాపోయాడు.
News October 30, 2025
నరసాపురం: చెరువులో పడి దివ్యాంగుడి మృతి

నరసాపురం మండలం లిఖితపూడి గ్రామానికి చెందిన దివ్యాంగుడు పెచ్చేట్టి సుబ్బారావు (75) గురువారం ముఖం కడుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్, ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాలించగా, సాయంత్రం చెరువులో సుబ్బారావు మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News October 30, 2025
రాహుల్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ఓట్ల కోసం మోదీ <<18140008>>డాన్స్<<>> కూడా చేస్తారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై BJP తీవ్రంగా స్పందించింది. బిహార్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది. ‘రాహుల్‌వి అత్యంత అవమానకర, అసభ్య వ్యాఖ్యలు. అత్యున్నత రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. PM వ్యక్తిత్వంపై దాడి చేయడమే’ అని మండిపడింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని, రాహుల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.


