News October 30, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. వేడి చేసిన నీటినే తాగండి

తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో వర్షాలు, వరద ప్రభావిత ప్రాంత ప్రజలు వేడి చేసిన నీటినే తాగాలని అధికారులు సూచించారు. తద్వారా వ్యాధుల ముప్పు నుంచి బయటపడొచ్చని చెప్పారు. ఈ సమయంలో జ్వరం బారిన పడితే నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. మరోవైపు కొన్ని చోట్ల అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.
Similar News
News October 30, 2025
రాహుల్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ఓట్ల కోసం మోదీ <<18140008>>డాన్స్<<>> కూడా చేస్తారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై BJP తీవ్రంగా స్పందించింది. బిహార్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది. ‘రాహుల్‌వి అత్యంత అవమానకర, అసభ్య వ్యాఖ్యలు. అత్యున్నత రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. PM వ్యక్తిత్వంపై దాడి చేయడమే’ అని మండిపడింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని, రాహుల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.
News October 30, 2025
అజహరుద్దీన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు: భట్టి

TG: దేశ క్రికెట్‌కు సేవలందించిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని చూస్తే వ్యతిరేకించడం సరికాదని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. దీనిని స్వాగతించకుండా ECకి <<18147731>>లేఖ<<>> రాయడం దారుణమని చెప్పారు. రాష్ట్రంపై ప్రేమ ఉన్నవారు అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించరని మండిపడ్డారు. దీనిపై BJP, BRS కలిసే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. మైనార్టీ అన్న ద్వేషంతోనే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటున్నారన్నారు.
News October 30, 2025
అసలు ఎవరీ శివాంగీ సింగ్..

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా యుద్ధ విమాన పైలట్ శివాంగీ సింగ్‌తో దిగిన ఫొటో వైరల్ అవుతోంది. దీంతో అసలెవరీమె అంటూ చర్చ మొదలైంది. శివాంగీ వారణాసిలో పుట్టి పెరిగారు. చదువుకొనేటప్పుడే NCCలో చేరారు. 2016లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2017లో రెండో దశ యుద్ధ విమాన పైలట్లలో ఒకరిగా ఎంపికై మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు నడిపారు. అలా 2020లో రఫేల్ మొదటి మహిళా పైలెట్‌గా చరిత్ర సృష్టించారు.


