News October 30, 2025
సంగారెడ్డి: ఈ ఖరీఫ్ సీజన్ మొత్తం కష్టాలే

ఈ ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటి నుంచి సంగారెడ్డి జిల్లా రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. మొదట వర్షాలు కురువకపోగా ఋతుపవనాలు లేటుగా ప్రవేశించాయి. దీంతో వరి నాట్లు లేటుగా వేశారు. వేసిన నాట్లకి చల్లడానికి యూరియా సరఫరా రాకపోవడంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మొంథా తుపాన్‌తో ధాన్యం తడవడంతో కన్నీళ్లే మిగిలాయి. రైతన్నకు ఈ ఖరీఫ్ సీజన్ అంత కలిసి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 30, 2025
సిద్దిపేట: కలెక్టర్‌లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్

సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో మొంథా తుపాను ప్రభావం సహాయక చర్యలు, తదితర పై అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలో 40 సెంటీమీటర్లకు పైగా వర్షలు పడ్డాయని, అపార పంట నష్టం వాటిల్లిందని అన్నారు. రైతులను ఆదుకోవాలని కోరారు.
News October 30, 2025
కాలుష్యం కాటుతో ఇండియాలో 17 లక్షల మంది మృతి

పెట్రోల్, డీజిల్ వంటి వినియోగంతో వెలువడుతున్న కాలుష్యానికి ప్రపంచవ్యాప్తంగా 2022లో 25 లక్షల మంది బలైనట్లు ‘ది లాన్సెట్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఒక్క ఇండియాలోనే 17 లక్షల మంది మరణించినట్లు వివరించింది. 2010తో పోలిస్తే మరణాలు 38% పెరిగినట్లు పేర్కొంది. ఈ ఇంధన వాడకం 2016 కన్నా 21% పెరిగిందని తేల్చింది. ఢిల్లీ వంటి చోట్ల కాలుష్యం స్థాయులు పెరుగుతుండడంతో ఈ రిపోర్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
News October 30, 2025
KNR: రూ.30 కోట్లు మంజూరు చేసిన TTD

KNRలోని పద్మానగర్‌లో నిర్మించనున్న వెంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి TTD ₹30 కోట్లు మంజూరు చేసింది. ఆలయ పరిసరాల్లో ₹3 కోట్లతో ఆధ్యాత్మిక ఉద్యానవనాన్ని కూడా నిర్మించనుంది. 4 ఏళ్ల క్రితం మాజీమంత్రి గంగుల కమలాకర్ ఆలయ నిర్మాణం కోసం అప్పటి TTD చైర్మన్‌కు ప్రతిపాదనలు పంపారు. దీనిని TTD ఆమోదించడంతో ఆలయానికి 10 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 2023 మే నెలలో దేవాలయానికి అంకురార్పణ చేశారు.


