News October 30, 2025
మణుగూరు వద్ద గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా

మణుగూరులోని అశోక్‌నగర్ సాయిబాబా గుడి వద్ద ఈరోజు పెను ప్రమాదం తృటిలో తప్పింది. సుమారు 340 వంట గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఒక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. సిలిండర్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో స్థానికులు భయాందోళన చెందారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News October 30, 2025
సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

సైనిక్ స్కూళ్లలో 6వ, 9వ తరగతిలో 2026-27 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. ఇవాళ్టితో ముగియనున్న గడువును నవంబర్ 9వ తేదీ వరకు పెంచారు. ఫీజు చెల్లింపునకు నవంబర్ 10 వరకు, తప్పుల సవరణకు 12-14 తేదీల్లో అవకాశం కల్పించారు. అర్హత పరీక్ష వచ్చే ఏడాది జనవరి 18న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది.
News October 30, 2025
గిరిజన ప్రాంతాల్లో మురుగునీరు ఉండకూడదు: మంత్రి

జిల్లాలోని గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో డ్రైన్లలో మురుగు నీరు లేకుండా పూర్తిగా తొలగించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి మనోహర్ గురువారం జిల్లా అధికారులను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో తాగునీరు ఎక్కడా కలుషితం కాకుండా ప్రజలకు అందించాలన్నారు. రవాణా సౌకర్యాలకు ఇబ్బంది లేకుండా రోడ్డు మరమ్మతు పనులను చేపట్టాలన్నారు. పెద్ద స్థాయి రోడ్డు పనులపై నివేదిక ఇవ్వాలన్నారు.
News October 30, 2025
ఇనుగుర్తిలో 254 మి.మీ అత్యధిక వర్షపాతం

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం 5గంటల వరకు వర్షపాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. ఇనుగుర్తిలో 254 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. గూడూరు 225.5, కేసముద్రం 205, MHBD167, తొర్రూర్ 165.5, డోర్నకల్ 155.5, అమనగల్ 155.3, నెల్లికుదురు 149.8, గార్ల 145, పెద్దవంగర 145, మరిపెడ 123, గంగారంలో అత్యల్పంగా 42.3 మి.మీ. వర్షపాతం నమోదయింది.


