News October 30, 2025

అల్పపీడనంగా బలహీనపడిన ‘మొంథా’

image

మొంథా వాయుగుండం నుంచి అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా కొనసాగుతోంది. ఇది తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌కు ఉత్తరంవైపు కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు అరేబియా సముద్రంలోని అల్పపీడనం ప్రభావంతో గుజరాత్, మహారాష్ట్రకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.

Similar News

News October 30, 2025

సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్

image

సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్‌ <<18087163>>సూర్యకాంత్‌<<>>ను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత CJI గవాయ్ చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ నవంబర్‌ 24న బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతారు. హరియాణా నుంచి ఎన్నికైన తొలి సీజేఐగా సూర్యకాంత్ నిలవనున్నారు.

News October 30, 2025

దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజహరుద్దీన్: కిషన్ రెడ్డి

image

TG: అజహరుద్దీన్‌కు మంత్రి పదవిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజహరుద్దీన్. దేశానికి చెడ్డ పేరు తెచ్చారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు’ అని వ్యాఖ్యానించారు. అటు జూబ్లీహిల్స్‌లో MIM ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ అభ్యర్థే జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

News October 30, 2025

WWC: ఆసీస్ భారీ స్కోరు.. భారత్ టార్గెట్ ఎంతంటే

image

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. 49.5 ఓవర్లకు 338 పరుగులు చేసి ఆలౌటైంది. లిచ్‌ఫీల్డ్ సెంచరీ(119) చేయగా, పెర్రీ(77), గార్డ్‌నర్ (63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో దీప్తి, చరణి చెరో 2 వికెట్లు, క్రాంతి, అమన్‌జ్యోత్, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 339 రన్స్.