News October 30, 2025
NLG: యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, R&B, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్, ఎస్పీని మంత్రి ఆదేశించారు.
Similar News
News October 30, 2025
తుఫాను.. అధికారులకు సెలవులు రద్దు: నల్గొండ కలెక్టర్

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లా అధికారులకు సెలవులు రద్దు చేస్తూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి సిబ్బంది అనుమతి లేకుండా సెలవుపై వెళ్లవద్దని, విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
News October 30, 2025
నల్గొండ: తుఫాను.. సహాయక చర్యలపై సీఎం వీసీ

మొంథా తుఫాను ప్రభావం, సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో నల్గొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. తుఫాను దృష్ట్యా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 27 నుంచే 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
News October 30, 2025
సైకిల్ ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఎన్.జి. కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఆయన పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారి ఆత్మ శాంతికి ప్రార్థనలు చేశారు.


