News October 30, 2025
పంట నష్టం: నేటి నుంచి ఎన్యూమరేషన్

AP: మొంథా తుఫాను ధాటికి 1.23L హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 1.38L మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. నేటి నుంచి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్(లెక్కింపు) నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 4,576KM మేర రోడ్లు, 302చోట్ల కల్వర్టులు, వంతెనలు ధ్వంసమైనట్లు నిర్ధారించారు. వీటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
Similar News
News October 30, 2025
సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్

సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ <<18087163>>సూర్యకాంత్<<>>ను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత CJI గవాయ్ చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24న బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతారు. హరియాణా నుంచి ఎన్నికైన తొలి సీజేఐగా సూర్యకాంత్ నిలవనున్నారు.
News October 30, 2025
దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజహరుద్దీన్: కిషన్ రెడ్డి

TG: అజహరుద్దీన్‌కు మంత్రి పదవిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజహరుద్దీన్. దేశానికి చెడ్డ పేరు తెచ్చారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు’ అని వ్యాఖ్యానించారు. అటు జూబ్లీహిల్స్‌లో MIM ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ అభ్యర్థే జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
News October 30, 2025
WWC: ఆసీస్ భారీ స్కోరు.. భారత్ టార్గెట్ ఎంతంటే

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. 49.5 ఓవర్లకు 338 పరుగులు చేసి ఆలౌటైంది. లిచ్‌ఫీల్డ్ సెంచరీ(119) చేయగా, పెర్రీ(77), గార్డ్‌నర్ (63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో దీప్తి, చరణి చెరో 2 వికెట్లు, క్రాంతి, అమన్‌జ్యోత్, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 339 రన్స్.


