News October 30, 2025

క్షేత్రస్థాయిలో పర్యటించిన బల్దియా కమిషనర్

image

గ్రేటర్ వరంగల్ పరిధిలోని వడ్డేపల్లి శ్యామల గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానిక అధికారులు, ప్రజలతో కమిషనర్ మాట్లాడి వరద నీటి ప్రవాహ పరిస్థితులను స్వయంగా పరిశీలించి పలు సూచనలను చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News October 30, 2025

పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలి: డీఈవో

image

పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి ఆదేశించారు. గురువారం ఎంఈవో శివప్రసాద్‌తో కలిసి ఉండవెల్లి మండలం బొంకూరులో ఎస్‌ఏ-1 పరీక్షల ప్రక్రియను ఆమె పరిశీలించారు. విద్యార్థులను ఇప్పటి నుంచే పరీక్షలకు సంసిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ఎఫ్‌ఏ-1, 2 మార్కుల జాబితా నమోదు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

News October 30, 2025

ట్రైనింగ్ ప్రోగ్రాం సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ జితేష్

image

ఫర్నిచర్ అసిస్టెంట్ 3 నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ఉపాధి పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా యువతకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. నవంబర్ 6న కలెక్టరేట్‌లో డ్రాయింగ్‌పై టెస్ట్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువత ఫర్నిచర్ ప్రొడక్షన్, ఇన్‌స్టలేషన్, మెషిన్ ఆపరేషన్ రంగాల్లో నైపుణ్యం సాధించి స్థిరమైన ఉద్యోగ అవకాశాలు పొందగలరని ఆయన చెప్పారు.

News October 30, 2025

కల్తీ నెయ్యి సరఫరాలో భారీ కుట్ర: సిట్

image

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని సిట్ తేల్చింది. ఈ అక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు <<16598439>>చిన్నఅప్పన్న<<>>కు భారీగా కమీషన్ ముట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆయన అరెస్టుతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారం భోలేబాబా డెయిరీని తప్పించి ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కాంట్రాక్టు దక్కించుకునేలా చేశారని తేలింది.