News October 30, 2025

వనపర్తి: ఈనెల 31న రన్ ఫర్ యూనిటీ 2K రన్: ఎస్పీ

image

దేశ ఏకత, సమైక్యతకు ప్రతీకైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ‘రన్ ఫర్ యూనిటీ 2K రన్’ లో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎకో పార్క్ వరకు 2K రన్ కొనసాగుతుందన్నారు. యువత, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, కవులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు పాల్గొన్నాలని కోరారు.

Similar News

News October 30, 2025

సోమశిలకు పెరుగుతున్న వరద

image

సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 4 నుంచి 8 క్రస్ట్ గేట్లు ఎత్తి 77,650 క్యూసెక్కుల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయానికి 78,460 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే మొత్తంలో కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 72 టీఎంసీలకు చేరింది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. వరద పెరుగుతుండటంతో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు.

News October 30, 2025

టీమ్ ఇండియాకు బిగ్ షాక్

image

WWC: ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్‌లో టీమ్ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్న స్మృతి మంధాన(24) ఔటయ్యారు. తొలుత బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించగా, ఆసీస్ క్యాచ్ కోసం రివ్యూ తీసుకుంది. రివ్యూలో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై స్మృతి అసంతృప్తిగా పెవిలియన్‌కు వెళ్లారు. అంతకుముందు షెఫాలీ 10 పరుగులకే వెనుదిరిగారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్ 60/2గా ఉంది.

News October 30, 2025

GWL: ‘నర్సింగ్ కాలేజీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి’

image

గద్వాలలో రూ.33.02 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కాలేజీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ మందిరంలో నర్సింగ్ కాలేజీ, విద్యార్థి వసతి గృహ ఏర్పాట్ల పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నవంబర్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.130 కోట్లతో వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేస్తారని తెలిపారు.