News October 30, 2025

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సెలవులు రద్దు

image

ఖమ్మం జిల్లాలో వర్ష ప్రభావం తగిన నేపథ్యంలో (రేపు) శుక్రవారం తిరిగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రారంభమవుతుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని తుఫాను ప్రభావం తగ్గి వాతావరణం పొడిగా ఉన్నందున మార్కెట్ను తిరిగి రేపు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కావున రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News October 30, 2025

మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల

image

ఖమ్మం: మున్నేరు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ 28 అడుగుల మార్కును దాటడంతో, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సాయంత్రం కలెక్టర్, సీపీతో కలిసి నదిని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, తగిన సమీక్షలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ సహా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News October 30, 2025

227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం: కలెక్టర్

image

ఖమ్మం నగరంలో మున్నేరు నది ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో 90 కుటుంబాల పరిధిలో 227 సభ్యులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వారికి అవసరమైన ఆహారం, పారిశుధ్యం, వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అతి తక్కువ ఆస్తి నష్టం, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. తుపాన్ వల్ల 24 రోడ్లపై నీటి ప్రవాహం రావడం వల్ల రాకపోకలు నిలిపి వేశామని పేర్కొన్నారు.

News October 30, 2025

క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి: సీఎం

image

ఖమ్మం: మొంథా తుఫాన్ నేపథ్యంలో మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.