News October 30, 2025

కోల్‌కత్తాలో తప్పించుకున్నా శంషాబాద్‌లో దొరికాడు

image

విశాల్ అనే వ్యక్తి కోల్‌కత్తా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ వచ్చాడు. ఆ తర్వాత అతడు మరో విమానంలో బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అతడి లగేజీని భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా బుల్లెట్ (38MM లైవ్ బుల్లెట్ ) బయటపడింది. దాని గురించి వివరాలు అడగ్గా సరైన సమాధానం లేదు. దీంతో ఆర్జీఐఏ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

Similar News

News October 30, 2025

నకిలీ మద్యం కేసు: ముగిసిన నిందితుల కస్టడీ

image

AP: నకిలీ మద్యం కేసులో జనార్దన్, జగన్మోహనరావు కస్టడీ ముగియగా VJA కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరి స్టేట్‌మెంట్లను అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని జనార్దన్ రావు చెప్పగా ఆ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో సైతం కోర్టుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ 7 రోజుల పాటు ఎక్సైజ్, సిట్ అధికారులు ప్రశ్నించారు.

News October 30, 2025

సెంచరీ భాగస్వామ్యం.. ఉత్కంఠగా మ్యాచ్

image

WWCలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టీమ్‌ఇండియా బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్(81*), హర్మన్ ప్రీత్(66*) అర్ధసెంచరీలు చేశారు. 59 పరుగులకే ఓపెనర్లు ఔటవ్వగా వీరిద్దరు సెంచరీ భాగస్వామ్యంతో జట్టును పటిష్ఠ స్థితిలోకి చేర్చారు. ప్రస్తుతం భారత్ స్కోరు 198/2. విజయానికి ఇంకా 19 ఓవర్లలో 141 పరుగులు చేయాల్సి ఉంది. ఎలాగైనా ఈ మ్యాచులో భారత్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News October 30, 2025

SKLM: పోలీస్ కుటుంబానికి రూ.కోటి అందజేత

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న జగదీష్ కుటుంబానికి రూ.కోటిలను ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ ఏడాది జూన్ నెలలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా ఈ నష్టపరిహారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిందని SP పేర్కొన్నారు. ఖాతాలకు పోలీస్ శాలరీ ప్యాకేజ్ అనుసంధానం చేసుకోవాలన్నారు.