News October 30, 2025
ఇల్లందులో అత్యధిక.. భద్రాచలంలో అత్యల్ప వర్షపాతం

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో.. ఇల్లందు 53.9, జూలూరుపాడు 43.3, చుంచుపల్లి 38.3, ఆళ్లపల్లి 33.5, సుజాతనగర్ 30.3, గుండాల 28.5, లక్ష్మీదేవిపల్లి 27.8, టేకులపల్లి 27.8, కొత్తగూడెం 27.3, చండ్రుగొండ 24, ములకలపల్లి 18.3, కరకగూడెం 17.5, అశ్వారావుపేట 14.5, దుమ్ముగూడెం 10.3, అశ్వాపురం 9.5, దమ్మపేట 8.9, మణుగూరు 7.8, బూర్గంపాడు 6, చర్ల 5.5, పినపాక 5, భద్రాచలం 4.7మీ.మీ.ల వర్షపాతం నమోదైంది.
Similar News
News October 30, 2025
నకిలీ మద్యం కేసు: ముగిసిన నిందితుల కస్టడీ

AP: నకిలీ మద్యం కేసులో జనార్దన్, జగన్మోహనరావు కస్టడీ ముగియగా VJA కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరి స్టేట్‌మెంట్లను అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని జనార్దన్ రావు చెప్పగా ఆ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో సైతం కోర్టుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ 7 రోజుల పాటు ఎక్సైజ్, సిట్ అధికారులు ప్రశ్నించారు.
News October 30, 2025
సెంచరీ భాగస్వామ్యం.. ఉత్కంఠగా మ్యాచ్

WWCలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టీమ్‌ఇండియా బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్(81*), హర్మన్ ప్రీత్(66*) అర్ధసెంచరీలు చేశారు. 59 పరుగులకే ఓపెనర్లు ఔటవ్వగా వీరిద్దరు సెంచరీ భాగస్వామ్యంతో జట్టును పటిష్ఠ స్థితిలోకి చేర్చారు. ప్రస్తుతం భారత్ స్కోరు 198/2. విజయానికి ఇంకా 19 ఓవర్లలో 141 పరుగులు చేయాల్సి ఉంది. ఎలాగైనా ఈ మ్యాచులో భారత్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News October 30, 2025
SKLM: పోలీస్ కుటుంబానికి రూ.కోటి అందజేత

శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న జగదీష్ కుటుంబానికి రూ.కోటిలను ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ ఏడాది జూన్ నెలలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా ఈ నష్టపరిహారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిందని SP పేర్కొన్నారు. ఖాతాలకు పోలీస్ శాలరీ ప్యాకేజ్ అనుసంధానం చేసుకోవాలన్నారు.


