News April 10, 2024

దిగ్విజయ్‌ను పాకిస్థాన్‌కు పంపిస్తాం: BJP MLA

image

కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్‌పై మధ్యప్రదేశ్‌కు చెందిన BJP MLA రామేశ్వర్‌శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దిగ్విజయ్‌పై మా BJP అభ్యర్థి లక్ష మెజారిటీతో గెలుస్తారు. ఆ తర్వాత ఆయనను పాకిస్థాన్‌కు పంపిస్తాం. అయనకు హిందుస్థాన్‌లో స్థానం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన దిగ్విజయ్ ఈ విషయంలో తానేం మాట్లాడాలనుకోవట్లేదన్నారు. చట్టపరంగా వెళతామని తెలిపారు.

Similar News

News November 15, 2024

వారానికి 5 రోజుల పని మంచిది కాదు: నారాయణ మూర్తి

image

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి హార్డ్ వర్క్‌పై మరోసారి కామెంట్లు చేశారు. తాను రోజులో 14గంటలు కష్టపడేవాడినని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అభివృద్ధి చెందుతున్న ఇండియాలో 5రోజుల పని దినాల విధానం మంచిది కాదన్నారు. హార్డ్ వర్క్‌కు ప్రత్యామ్నాయం లేదని, మీరు అత్యంత తెలివైన వ్యక్తి అయినా కష్టపడాల్సిందేనని చెప్పారు. PM మోదీ వారానికి 100గంటలు పని చేస్తారని దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

News November 15, 2024

ఫైల్స్ దగ్ధం.. ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్‌పై అభియోగాలు

image

AP: మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో దస్త్రాల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 22ఎ అసైన్డ్ భూములపై కొందరు అక్రమంగా హక్కులు సాధించారని, ఆ ఆధారాలు ఉండొద్దనే రికార్డులు తగలబెట్టారని CID ప్రాథమిక నివేదికలో పేర్కొంది. దీనికి ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్‌ను బాధ్యులుగా గుర్తించిన ప్రభుత్వం వారిపై అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులిచ్చారు.

News November 15, 2024

వయనాడ్ విషాదం జాతీయ విపత్తు కాదు: కేంద్రం

image

అధికారికంగా 231 మంది చనిపోయిన వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా పరిగణించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇది సాధ్యం కాదని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు. కేరళ ప్రభుత్వం రూ.900 కోట్ల సాయం కోరగా, ఆ రాష్ట్రానికి కేటాయించిన రూ.388 కోట్లలో 291 కోట్లను రెండు విడతలుగా ఇచ్చినట్లు వెల్లడించారు. పైగా ఆ రాష్ట్ర SDRF ఖాతాలో తగినంత నిధులు (రూ.395 కోట్లు) ఉన్నాయన్నారు.