News October 30, 2025
మినిస్టర్ అజ్జూ భాయ్.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్

కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ముందు ప్లాన్ ప్రకారం పథకం అమలు చేసింది. మంత్రి వర్గంలోకి భారత క్రికెట్ మాజీ కెప్టన్ అజాహరుద్దీన్‌ను తీసుకునేందుకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ప్రమాణ స్వీకారమే తరువాయి. కాగా ప్రచారానికి వచ్చిన ఆయన ముఖంలో వెలితి కనిపించింది. ఇక్కడి మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లించుకునేందుకే ఈ ఎత్తుగడ వేసిందని పరిశీలకులు భావిస్తున్నారు.
Similar News
News October 31, 2025
సిరిసిల్లలో ఎస్పీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో గురువారం రాత్రి పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ర్యాలీని ప్రారంభించి, నేతన్న చౌరస్తా నుంచి గాంధీ విగ్రహం వరకు నడిపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News October 31, 2025
HNK: ‘మా బేబీ మాకు కావాలి’ అంటూ బంధువుల ఆందోళన

హన్మకొండ నయినగర్‌లోని ఓ హాస్పిటల్‌లో ఆపరేషన్ సమయంలో శిశువు మృతి చెందడం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆపరేషన్ వికటించి బాబు మరణించాడని, అయితే ఆస్పత్రి వైద్యులు ఈ విషయాన్ని దాచిపెట్టి నాలుగు రోజులుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ‘మా బేబీ మాకు కావాలి’ అంటూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగగా.. డాక్టర్ తప్పిదం లేదంటూ హాస్పత్రి సిబ్బంది వాదిస్తున్నారు.
News October 31, 2025
KNR: ‘చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం’

KNR జిల్లా చిట్‌ఫండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొదుపు దినోత్సవం నిర్వహించారు. ‘ఈరోజు మనం పొదుపు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది కేవలం ఒక ఆచార దినం కాదు. ఇది ప్రతి కుటుంబంలో ఆర్థిక శ్రద్ధ, భవిష్యత్ భద్రత, క్రమశిక్షణకు సంకేతం’ అని అధ్యక్షులు పెంట శ్రీనివాస్ అన్నారు. చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.


