News April 10, 2024

అనంత: పోలింగ్‌కు 24 వేల మంది సిబ్బంది

image

పోలింగ్‌కు అన్ని కేడర్ల అధికారులు, సిబ్బంది కలిపి దాదాపు 24 వేల మందిని నియమించారు. పీఓలు 2,552, ఏపీఓలు 2,715, ఓపీఓలు 9 వేలకు పైగా, పోలీసు సిబ్బంది 3,500, ఎన్నికల నిర్వహణ కమిటీల సిబ్బంది 570, నోడల్ అధికారులు 33 మంది, సెక్టార్ అధికారులు 481 మంది ఉన్నారు. వివిధ స్థాయిల్లో 33 శాఖలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించారు.

Similar News

News February 1, 2026

అనంతపురం జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు

image

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు తగ్గాయి. గుత్తిలో కేజీ రూ.240, అనంతపురంలో రూ.250, గుంతకల్లులో రూ.220గా విక్రయిస్తున్నట్లు వ్యాపారి రియాజ్ తెలిపారు. గత వారంతో పోలిస్తే ధరలు తగ్గడం పట్ల వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.750 వద్ద స్థిరంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ధరల తగ్గుదల నేపథ్యంలో చికెన్ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది.

News February 1, 2026

అంబటిపై ఫిర్యాదు చేసిన TDP ఎమ్మెల్యే

image

వైసీపీ నేత అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యలపై పూల నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌కి శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణీ శ్రీ, జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీధర్ చౌదరి ఫిర్యాదు చేశారు. పూల నాగరాజు మాట్లాడుతూ.. రాజకీయాల్లో మంచిగా వ్యవహరించాలని అంబటికి హితవుపలికారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదన్నారు.

News February 1, 2026

వైసీపీ నేతల సంస్కారానికి అంబటి రాంబాబు వ్యాఖ్యలే నిదర్శనం: MLA

image

వైసీపీ నేతల సంస్కారానికి ఆపార్టీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రంగా దూషించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కాస్తయినా సభ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. ఆయన గతంలో కూడా అనేక వివాదస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.