News October 30, 2025
ICMRలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ICMRలో 15 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, MBA, PG డిప్లొమా, CA, ICWA, M.COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులో తప్పుల సవరణ NOV 5 – 7వరకు చేసుకోవచ్చు. NOV 10న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. NOV 15న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీని తర్వాత ప్రకటిస్తారు. వెబ్‌సైట్: www.icmr.gov.in/
Similar News
News November 3, 2025
మీర్జాగూడ ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

TG: మీర్జాగూడ<<18183462>> ప్రమాదంలో<<>> మృతులంతా చేవెళ్ల వాసులేనని తెలుస్తోంది. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగులే ఉన్నారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యల పర్యవేక్షణకు సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాంటాక్ట్ నం: 9912919545, 9440854433.
News November 3, 2025
బస్సు ప్రమాదంలో 25కు పెరిగిన మృతుల సంఖ్య

TG: రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో <<18183371>>మృతుల సంఖ్య<<>> భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 25 మంది మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులేనని సమాచారం. మరోవైపు ఘటనాస్థలం వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే యాదయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు విస్తరణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
News November 3, 2025
ఎయిమ్స్ రాయ్‌బరేలిలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

ఎయిమ్స్ రాయ్‌బరేలి 16 జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంబీబీఎస్, BDS అర్హతతో పాటు ఇంటర్న్‌షిప్ చేసినవారు ఈనెల 10న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ట వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.56,100 జీతం అందుతుంది. వెబ్‌సైట్: https://aiimsrbl.edu.in/


