News October 30, 2025
రామగుండం: ‘విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి’

RGM సింగరేణి వైద్య కళాశాలలో గురువారం జరిగిన వైట్ కోట్ సెర్మనీలో పాల్గొన్న పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష వైద్యవృత్తిని ఎంచుకున్న విద్యార్థులు ఏ విపత్కర పరిస్థితులలోనైనా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సింగరేణి మెడికల్ కాలేజ్ అత్యుత్తమ వసతులతో ఉన్నదని, ఫ్యాకల్టీ కట్టుబాటుతో పనిచేస్తోందని తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. నరేందర్, డా. లావణ్య, డా. ప్రదీప్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 31, 2025
జగిత్యాల: పర్యావరణ అనుమతి తప్పనిసరి: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్ లేదా కొత్త లీజు మంజూరుకు రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అధ్యయన సంస్థ (SEIAA) జారీ చేసే పర్యావరణ అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన డ్రాఫ్ట్ జిల్లా సర్వే నివేదికను ప్రజాభిప్రాయం కోసం జిల్లా వెబ్‌సైట్‌లో (jagtial.telangana.gov.in) పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.
News October 31, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర ₹2011, కనిష్ఠ ధర ₹1700, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర ₹1820, కనిష్ఠ ధర ₹1775, వరి ధాన్యం (JSR) ధర ₹1950గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. అటు మార్క్‌ఫెడ్ ద్వారా నేడు మక్కల కొనుగోళ్లు జరగలేదని పేర్కొన్నారు.
News October 31, 2025
వాంకిడి: ‘నా కూతురు చావుకి కారుకులైన వారిని శిక్షించాలి’

తన కూతురు ప్రేమలత చావుకి కారకులైన వారిని శిక్షించాలని తండ్రి మేంఘజి కోరారు. ఈ మేరకు వాంకిడి ఎస్ఐ మహేందర్‌కి ఫిర్యాదు చేశాడు. ఖిరిడికి చెందిన ప్రేమలత(22)అదే గ్రామానికి చెందిన మహేశ్‌ను వివాహం చేసుకుంది.ఈనెల 23న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబీకులు ఆమెను వర్ధా ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ 29న మృతిచెందింది. అత్తింటి వారి వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు.


