News October 30, 2025

KNR: మొంథా తుఫాన్.. రైతన్నలకు మిగిల్చింది తడిసిన ధాన్యమే

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అధికారుల అంచనా ప్రకారం 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో తడిసి ముద్దయినట్లు సమాచారం. చేతికి వచ్చిన పంట అమ్ముకునే సమయంలో వర్షాలు పడి పంట నష్టాన్ని కలిగించిందన రైతులు వాపోయారు. రైతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించే సాయమే మిగిలిందని రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు.

Similar News

News October 31, 2025

KNR: ‘చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం’

image

KNR జిల్లా చిట్‌ఫండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొదుపు దినోత్సవం నిర్వహించారు.‌ ‘ఈరోజు మనం పొదుపు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది కేవలం ఒక ఆచార దినం కాదు. ఇది ప్రతి కుటుంబంలో ఆర్థిక శ్రద్ధ, భవిష్యత్‌ భద్రత, క్రమశిక్షణకు సంకేతం’ అని అధ్యక్షులు పెంట శ్రీనివాస్ అన్నారు. చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.

News October 31, 2025

సైదాపూర్: రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం: పొన్నం

image

సైదాపూర్ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు, నష్టపోయిన పంటలను మొత్తం రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వెంట కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ అలం ఉన్నారు.

News October 31, 2025

KNR: బాల్య వివాహాలపై 1098కు ఫిర్యాదు చేయండి

image

బాల్య వివాహాలు, బాలలపై జరుగుతున్న ఆగడాలపై ధైర్యంగా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సూచించారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన (DDU-GKY) కేంద్రంలో గురువారం యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ అందించే సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఈ సందర్భంగా వివరించారు.