News April 10, 2024
ఒక్కో జట్టుకు 8 మంది ప్లేయర్ల రిటైన్?
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఒక్కో ఫ్రాంచైజీ 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెజారిటీ జట్లు ఇదే భావనలో ఉన్నట్లు సమాచారం. కానీ ముగ్గురు లేదా నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకోవాలని గతంలో ఐపీఎల్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. కాగా ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఐపీఎల్ మెగా వేలం నిర్వహిస్తారు. ఈ సారి 2025లో జరగనుంది. ఇందులో దాదాపు 1000 మందికిపైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు.
Similar News
News November 15, 2024
ఫైల్స్ దగ్ధం.. ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్‌పై అభియోగాలు
AP: మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో దస్త్రాల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 22ఎ అసైన్డ్ భూములపై కొందరు అక్రమంగా హక్కులు సాధించారని, ఆ ఆధారాలు ఉండొద్దనే రికార్డులు తగలబెట్టారని CID ప్రాథమిక నివేదికలో పేర్కొంది. దీనికి ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్‌ను బాధ్యులుగా గుర్తించిన ప్రభుత్వం వారిపై అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులిచ్చారు.
News November 15, 2024
వయనాడ్ విషాదం జాతీయ విపత్తు కాదు: కేంద్రం
అధికారికంగా 231 మంది చనిపోయిన వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా పరిగణించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇది సాధ్యం కాదని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు. కేరళ ప్రభుత్వం రూ.900 కోట్ల సాయం కోరగా, ఆ రాష్ట్రానికి కేటాయించిన రూ.388 కోట్లలో 291 కోట్లను రెండు విడతలుగా ఇచ్చినట్లు వెల్లడించారు. పైగా ఆ రాష్ట్ర SDRF ఖాతాలో తగినంత నిధులు (రూ.395 కోట్లు) ఉన్నాయన్నారు.
News November 15, 2024
డిగ్రీ రెండున్నరేళ్లే.. వచ్చే ఏడాది నుంచి అమలు: UGC ఛైర్మన్
విద్యార్థులు 3ఏళ్ల డిగ్రీ కోర్సును రెండున్నరేళ్లలో, 4ఏళ్ల కోర్సును మూడేళ్లలోనే పూర్తిచేసే అవకాశాన్ని UGC కల్పించనుంది. 2025-26 నుంచి దీన్ని అమలు చేస్తామని UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ వెల్లడించారు. స్లోగా చదివే విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లలో పూర్తిచేసే ఛాన్స్ ఇస్తామని, అలాగే మధ్యలో విరామం తీసుకుని మళ్లీ చేరే అవకాశాన్నీ కల్పిస్తామని తెలిపారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు.