News April 10, 2024
మదనపల్లె: ఇరు వర్గాల ఘర్షణలో ఇద్దరికి గాయాలు

మద్యం మత్తులో ఆటో డ్రైవర్లు గొడవపడి గాయపడ్డ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు వివరాల ప్రకారం.. మదనపల్లె మోతినగర్లో ఆటో నడిపే ఖాజా(50), రెడ్డెప్ప(52)లు కలసి మిషన్ కాంపౌండ్ వద్ద మద్యం తాగారు. అనంతరం ఇంటికివచ్చే క్రమంలో ఇద్దరు గొడవపడి ఒకరి నొకరు కొట్టుకున్నారు. ఈగొడవలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని, సహచరులు గమనించి వెంటనే స్థానిక జిల్లాఆస్పత్రికి తరలించారు.
Similar News
News September 18, 2025
కాణిపాకం ఆలయ చైర్మన్గా మణి నాయుడు

కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆలయ ఛైర్మన్గా వి.సురేంద్ర నాయుడు అలియాస్ మణి నాయుడును నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ ఆయన కాణిపాకం ఆలయ చైర్మన్గా విధులు నిర్వహించారు. రెండోసారి బాధ్యతలను అప్పజెప్పడంతో సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News September 18, 2025
జిల్లాలో 3,293 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ: కలెక్టర్

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు, నగరి నియోజకవర్గ పరిధిలోని 125 క్లస్టర్లలో 3,293 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాలు, సొసైటీలలో యూరియా పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
News September 18, 2025
కోచింగ్ లేకుండానే టీచర్ అయ్యాడు..!

SRపురం(M) కొత్తపల్లిమిట్టకి చెందిన ప్రభుకుమార్ టీచర్ ఉద్యోగం సాధించాడు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యాడు. తండ్రి ఏసుపాదం రెండేళ్ల క్రితం చనిపోగా.. తల్లి మణియమ్మ రోజు కూలికి వెళ్లి ఇంటి బాగోగులు చూస్తున్నారు. ఉద్యోగం రావడంతో ఇక అమ్మను కూలి పనులకు పంపకుండా బాగా చూసుకుంటానని ప్రభు కుమార్ తెలిపాడు.