News October 30, 2025
WWC: ఆసీస్ భారీ స్కోరు.. భారత్ టార్గెట్ ఎంతంటే

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. 49.5 ఓవర్లకు 338 పరుగులు చేసి ఆలౌటైంది. లిచ్‌ఫీల్డ్ సెంచరీ(119) చేయగా, పెర్రీ(77), గార్డ్‌నర్ (63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో దీప్తి, చరణి చెరో 2 వికెట్లు, క్రాంతి, అమన్‌జ్యోత్, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 339 రన్స్.
Similar News
News October 31, 2025
₹39,216 కోట్ల ఒప్పందాలపై విశాఖ పోర్టు సంతకాలు

AP: ముంబైలో జరిగిన మారిటైమ్ వీక్-2025 సమావేశాల్లో విశాఖపట్నం పోర్టు అథారిటీ(VPA) ₹39,216 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. దుగరాజపట్నంలో మేజర్ పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్&రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం AP ప్రభుత్వంతో ₹29,662 కోట్ల ఒప్పందం చేసుకుంది. మెకాన్ ఇండియాతో ₹3,000 కోట్లు, NBCCతో ₹500 కోట్లు, హడ్కోతో ₹487.38 కోట్లు, రైల్ వికాస్ నియమిటెడ్‌తో ₹535 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది.
News October 31, 2025
వెడ్డింగ్ సీజన్: ₹6.5 లక్షల కోట్ల వ్యాపారం.. కోటి ఉద్యోగాలు

నవంబర్ 1 నుంచి వెడ్డింగ్ సీజన్ మొదలు కాబోతోంది. 45 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 46 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) రీసెర్చ్ అంచనా వేసింది. ఈ పెళ్లి వేడుకలతో రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలిపింది. కోటి ఉద్యోగాలు జెనరేట్ అవుతాయని వెల్లడించింది. 2024లో 48 లక్షల పెళ్లిళ్లు, 5.9 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు వివరించింది.
News October 31, 2025
అక్టోబర్ 31: చరిత్రలో ఈరోజు

1875: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జననం
1895: IND టెస్ట్ టీమ్ తొలి కెప్టెన్ CK.నాయుడు జననం
1975: సంగీత దర్శకుడు ఎస్‌డీ బర్మన్ మరణం
1984: మాజీ PM ఇందిరా గాంధీ మరణం
1990: గాయని ML.వసంతకుమారి మరణం
2022: పారిశ్రామికవేత్త జేజే ఇరానీ మరణం
* జాతీయ ఐక్యతా దినోత్సవం (వల్లభ్‌భాయ్ జయంతిని కేంద్రం జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుతోంది)


