News April 10, 2024
కువైట్‌లో ఓబులవారిపల్లె వాసి మృతి

బతుకుతెరువు కోసం కువైట్‌కి వెళ్లి ప్రమాదశాత్తు ఓబులవారిపల్లెకు చెందిన ఓబిలి సుబ్బ నరసింహారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఈయన కొన్నేళ్లుగా కువైట్‌లో క్రేన్ దగ్గర ఉద్యోగరీత్యా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు. డ్యూటీకి వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఇసుక లారీ వ్యాన్‌ను ఢీకొనడంతో వెనుక భాగంలో ఉన్న ఇతను అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Similar News
News March 14, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,700
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,444
*వెండి 10 గ్రాముల ధర రూ.2,620.
News March 14, 2026
మహిళ ఆత్మహత్య వీడియో వైరల్.. స్పందించిన సజ్జనార్

కళ్లెదుటే <<19370480>>భార్య ప్రాణాలు<<>> తీసుకుంటుంటే.. అడ్డుకొని కాపాడాల్సిన భర్త హేళన చేస్తూ వీడియో తీయడం అత్యంత విచారకరం. సమాజానికి సిగ్గుచేటని HYD సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ట్వీట్ చేశారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజమని, పంతాలకు పోయి ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయేదాకా కెమెరా పట్టుకుని చోద్యం చూడడం పైశాచికత్వం అని పేర్కొన్నారు. దయచేసి బంధాలకు విలువనివ్వాలని, క్షణికావేశంలో ఇలా చేస్తే ఆపాలన్నారు.
News March 14, 2026
కడప: 10th పబ్లిక్.. ఎగ్జామ్ సెంటర్ గుర్తించండిలా.!

కడప (D)లో ఈ నెల 16 నుంచి 10th పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా విద్యార్థులకు ప్రభుత్వం ఓ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్ష కేంద్రాలను గుర్తించడంలో ఇబ్బందులు లేకుండా హాల్ టికెట్‌లో QR కోడ్‌ను ముద్రించారు. దీనిని ఫోన్‌లో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్ ఫొటోలు కనిపిస్తాయని కడప జిల్లా DEO షంషుద్దీన్ తెలిపారు. మరింత సమాచారం కోసం <<19371473>>ఇక్కడ క్లిక్ చేయండి.<<>>


