News October 30, 2025
జిల్లాలో 77,415 ఎకరాల్లో పంట నష్టం: DAO

జిల్లా పరిధిలోని 25 మండలాల్లో మొంథా తుపాన్ ధాటికి 77,415 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని DAO సుబ్రహ్మణ్యేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ప్రాథమిక అంచనా ప్రకారం వరి 65,192 ఎకరాలు, మినుము 4,568, మొక్కజొన్న 3,441, పత్తి 3,244, కంది 507, శనగ 338.5, సోయాబీన్ 74.13, పెసర 49.5, నువ్వులు 6.92, జూట్ 5.9, జొన్న 5 ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందన్నారు.
Similar News
News October 31, 2025
సత్యసాయి శత జయంతి: ఆరుగురు మంత్రులతో కమిటీ

సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం, ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మంత్రి అనగాని సత్యప్రసాద్, సభ్యులుగా మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేశ్, సవిత, ఆనం రామనారాయణ రెడ్డి నియమితులయ్యారు. కమిటీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు MLA పల్లె సింధూర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
News October 31, 2025
ఆవు నెయ్యి అభిషేకంతో ఐశ్వర్య ప్రాప్తి

శివుడికి అభిషేకాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆయనకు చాలామంది అభిషేకాలు చేస్తుంటారు. అలా చేసినవారిపై ఆయన అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతారు. అయితే.. ఆవు నెయ్యితో శివ లింగాన్ని అభిషేకించడం వల్ల ఈశ్వరుడు ఐశ్వర్య ప్రాప్తిని ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు. శ్రేయస్సుకు, పవిత్రతకు చిహ్నంగా భావించే ఈ అభిషేకం ద్వారా అదృష్టం, సంపద కలిసివస్తాయని, ధనలక్ష్మి స్థిరంగా ఉంటుందని నమ్మకం.
News October 31, 2025
2,790 మంది ఇండియన్స్‌ను US తిరిగి పంపింది: కేంద్రం

చట్ట వ్యతిరేకంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన ఇతర దేశస్థులను అమెరికా వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు US నుంచి 2,790 మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. వీరంతా అక్కడ చట్టవిరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి నివసించారని పేర్కొన్నారు. అటు 2025లో ఇప్పటివరకు దాదాపు 100 మంది అక్రమవలసదారులను UK తిరిగి పంపిందని తెలిపారు.


