News April 10, 2024
టీడీపీలో చేరిన మంత్రి అంబటి బంధువు

బాపట్లకు చెందిన వివేకా సర్వీస్ సొసైటీ కార్యదర్శి, మంత్రి అంబటి రాంబాబు బంధువు అంబటి మురళీకృష్ణ టీడీపీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మురళీకృష్ణకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటి మురళీకృష్ణ 1989 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. 2010 ఓదార్పు యాత్రలో వెదుళ్లపల్లిలోని తన కార్యాలయంలో వైఎస్ జగన్‌కు బస ఏర్పాటు చేశారు.
Similar News
News September 10, 2025
ఆనాటి హాస్యనటుడు పి.ఎల్. నారాయణ మన బాపట్ల వాసే

విలక్షణమైన నటుడు, రచయిత, నాటక ప్రయోక్త పి.ఎల్. నారాయణగా పేరుపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ (సెప్టెంబర్ 10, 1935 – నవంబరు 3, 1998) ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు, హాస్య ప్రధానమైన పాత్రలు పోషించారు. 1992లో యజ్ఞం సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు.
News September 10, 2025
ప్రపంచ ప్రఖ్యాతి రసాయన శాస్త్రవేత్త మన నాయుడమ్మ

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ (SEP 10, 1922 – జూన్ 23, 1985) గుంటూరు జిల్లా యలవర్రులో జన్మించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగి శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకొని దేశ ఖ్యాతిని పెంచిన ప్రొఫెసర్ నాయుడమ్మ పలు ప్రతిష్ఠాత్మక హోదాలను అందుకున్నారు. భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు డైరెక్టర్‌గా పనిచేశారు.1971లో పద్మశ్రీ వరించింది. నేడు ఆయన జయంతి.
News September 9, 2025
జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్ నాగలక్ష్మి

గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్యతరహా పనులకు వారం రోజుల్లో, పెద్ద పనులకు రెండు వారాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.