News October 30, 2025

మంచిర్యాల: పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి: MCPIU

image

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాల కారణంగా విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సెలవులు ప్రకటించాలని కోరారు.

Similar News

News October 31, 2025

సంగారెడ్డి: పట్టుబడిన రేషన్ బియ్యం వేలం

image

అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన రేషన్ బియ్యాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) మాధురి తెలిపారు. జిల్లా గోదాముల్లో నిల్వ ఉంచిన సుమారు 3,872.05 క్వింటాళ్ల బియ్యాన్ని నవంబర్ 11న సాయంత్రం 4 గంటలకు వేలం వేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యాపారులు ఈ వేలంలో పాల్గొనవచ్చు.

News October 31, 2025

అరకు అందాల సీజన్‌కు ప్రత్యేక రైళ్లు

image

చల్లని వాతావరణం.. పచ్చని లోయలు, జలపాతాలతో అరకులోయ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఈ సీజన్‌లో ఈస్ట్ కోస్ట్ రైల్వే అరకు–యెలహంకా (బెంగళూరు) మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడపనుంది. దీంతో రాయలసీమ నుంచి నేరుగా అనకాపల్లి, దువ్వాడ మీదుగా అరకు చెరుకునే అవకాశం ఏర్పడింది. ఈ రైళ్లు నవంబర్ 13, 17, 23, 24న మధ్యహ్నం 12కి అరకు నుంచి బయలుదేరుతాయి. అదేవిధంగా 14, 18, 24, 25న యెలహంకా నుంచి మ.1.30-2 గంటల మధ్య తిరుగుపయనమౌతాయి.

News October 31, 2025

2,569 ఇంజినీర్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. SCR పరిధిలో 103 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్, BE అర్హతగల అభ్యర్థులు NOV 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.