News October 30, 2025
రంపచోడవం ఓఎస్డీ విశాఖ డీసీపీ-1గా బదిలీ

రంపచోడవరం ఆపరేషన్స్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ), అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ జగదీశ్ అడహళ్లి విశాఖపట్నం డీసీపీ-1 (లా అండ్ ఆర్డర్)గా బదిలీ అయ్యారు. ఈమేరకు డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జగదీశ్ అడహళ్లి యూపీఎస్సీ పరీక్షల్లో 440వ ర్యాంకు సాధించారు. అల్లూరి జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేశారు.
Similar News
News October 31, 2025
ADB: ఏకలవ్య గురుకులాల ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమీక్ష

కలెక్టరేట్‌లో గురువారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజర్షి షా నిర్వహించారు. ఏకలవ్య పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, నాణ్యమైన విద్యపై ఆయన ప్రిన్సిపల్స్‌ను ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, డీఎంహెచ్‌వో, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
News October 31, 2025
అనకాపల్లి: రేపు రూ.108.8 కోట్ల పింఛన్ల పంపిణీ

అనకాపల్లి జిల్లా 24 మండలాలతో పాటు అనకాపల్లి జీవీఎంసీ, ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల పరిధిలో శనివారం లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి రూ.108.8 కోట్ల పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శచీదేవి తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ ఆధారంగా సొమ్ము అందజేస్తారని చెప్పారు. కొత్తగా 344 స్పౌజ్ పింఛన్లు మంజూరై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
News October 31, 2025
MBNR: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(TOSS) ఎస్ఎస్సీ, ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదలైనట్లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ యం.శివయ్య Way2Newsతో తెలిపారు. గత నెల 22 నుంచి 28 వరకు పరీక్షలు నిర్వహించామన్నారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులు పరీక్ష ఫలితాలను www.telanganaopenschool.org వెబ్ సైట్‌లో చూసుకోవాలన్నారు. #SHARE IT.


