News October 30, 2025

వాగులో గల్లంతై అంగన్వాడీ టీచర్ మృతి

image

వాగులో గల్లంతై అంగన్వాడి టీచర్ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. భువనగిరి మండలం నందనంకు చెందిన అంగన్వాడి మొదటి సెంటర్ టీచర్ కృష్ణవేణి తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లి తిరిగి విధులకు వస్తుండగా ప్రమాదం జరిగింది. భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై మజీద్ పూర్- బాటసింగారం దారి నుంచి వస్తుండగా మధ్య వాగులో కొట్టుకుపోయి గల్లంతై మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 31, 2025

జగిత్యాల: కులదూషణ కేసులో నిందితుడికి జైలు

image

కులం పేరుతో దూషించి హత్యాయత్నం చేసిన కేసులో జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి జాబితాపూర్‌కు చెందిన నిందితుడు బత్తిని సంతోష్‌కు ఏడాది కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ కరీంనగర్ 3వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి నీరజ తీర్పునిచ్చారు. 2020 జనవరి 26న సంతోష్ సాగర్‌ను కులం పేరుతో దూషించి స్క్రూ డ్రైవర్‌తో దాడిచేశాడు. దర్యాప్తు అనంతరం కోర్టులో నేరం రుజువైనట్లు SP అశోక్‌ కుమార్ తెలిపారు.

News October 31, 2025

రాజమండ్రి ఎంపీపై కేసు నమోదు చేయాలి: జేటీ రామారావు

image

ఏపీలో అణువిద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే అదానీ కోసం రాజమండ్రి ఎంపీ పురంధీశ్వరి అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఆమె పర్యటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. శ్రీకాకుళం(D) కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం USకు చెందిన వెస్టింగ్ హౌజ్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయన్నారు.

News October 31, 2025

జూబ్లీహిల్స్‌లో నేడు హైవోల్టేజ్ పొలిటికల్ షో

image

జూబ్లీ బైపోల్ ప్రచారం తారస్థాయికి చేరింది. ఇప్పటికే కాంగ్రెస్, BRS, BJP ఇక్కడ మకాం వేశాయి. నేడు సీఎం రేవంత్‌రెడ్డి, KTR రోడ్‌షో నిర్వహించనున్నారు. ఒకేరోజు ఇరుపార్టీల కీలకనేతలు ప్రచారంలో పాల్గొననుండటం, MIM నుంచి పలువురు నేతలు BRSలో చేరనున్నారని వార్తలు రావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్ర రాజకీయాలన్నీ జూబ్లీహిల్స్ వైపే మళ్లాయి. ప్రచారంలో వీరిద్దరు ఏం మాట్లాడతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.