News October 31, 2025
PHOTO OF THE DAY: దూరదర్శినితో DGP, CP

బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను గురువారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు. డేటా సెంటర్, స్టేట్ కాన్ఫరెన్స్ హాల్, సీపీ కార్యాలయం, హెలిప్యాడ్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. CP సజ్జనార్‌తో కలిసి దూరదర్శిని సాయంతో నగరాన్ని వీక్షించారు. వీరి వెంట ICCC డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉన్నారు.
Similar News
News October 31, 2025
సిరిసిల్ల: నిద్రలోనే కన్నుమూసిన మహిళ

ఓ మహిళ నిద్రలోనే కన్నుమూసిన ఘటన సిరిసిల్ల(D) గంభీరావుపేట మండలం దోసెలగూడెంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మల లక్ష్మణ్ భార్య లక్ష్మి(48) హఠాత్తుగా నిద్రలోనే కన్నుమూశారు. కాగా, ఆమె గుండెపోటుతో మృతిచెందినట్లు స్థానికులు అంటున్నారు. మృతురాలి భర్త కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కావడంతో భారీసంఖ్యలో నాయకులు, స్థానికులు ఆయన నివాసానికి చేరుకుని ఓదార్చారు.
News October 31, 2025
UPDATE: నవ దంపతులను తీసుకొస్తుండగా యాక్సిడెంట్

హనుమకొండ జిల్లాలో రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో <<18155214>>ముగ్గురు మృతి<<>>చెందిన విషయం తెలిసిందే. బంధువులు తెలిపిన వివరాలిలా.. కురవి మండలం సూధనపల్లికి చెందిన యువతికి బుధవారం పెళ్లైంది. నవదంపతులను తీసుకొస్తుండగా గోపాలపురం వద్ద రోడ్డు పక్కకు ఆపిన వీరి బోలేరోను వేగంగా వచ్చిన బోర్ వెల్స్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనాథ్, స్వప్న, కలమ్మ స్పాట్‌లోనే మృతి చెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News October 31, 2025
కర్నూలు ప్రమాదం.. కార్గో క్యాబిన్‌లో రెండో డ్రైవర్ నిద్ర

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఘటన జరిగినప్పుడు 2వ డ్రైవర్ శివనారాయణ బస్సు కింది భాగంలోని కార్గో క్యాబిన్‌లో నిద్రపోయారు. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ లక్ష్మయ్య తన వద్దకు వచ్చినట్లు శివ తెలిపారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపు కాలేదన్నారు. బస్సు కుడివైపు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించామని, ఆ ప్రయత్నం వల్ల 27మంది బతికారని చెప్పారు. ఈ ఘటనలో 19మంది చనిపోయారు.


