News October 31, 2025
PHOTO OF THE DAY: దూరదర్శినితో DGP, CP

బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను గురువారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు. డేటా సెంటర్, స్టేట్ కాన్ఫరెన్స్ హాల్, సీపీ కార్యాలయం, హెలిప్యాడ్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. CP సజ్జనార్‌తో కలిసి దూరదర్శిని సాయంతో నగరాన్ని వీక్షించారు. వీరి వెంట ICCC డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉన్నారు.
Similar News
News October 31, 2025
HYD: ‘రన్ ఫర్ యూనిటీ’లో సీపీ, చిరంజీవి

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీసుల శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీపీ సజ్జనార్, నటుడు చిరంజీవి పాల్గొన్నారు. ఐక్యతకు మారుపేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వారు గుర్తు చేశారు. పెద్ద సంఖ్యలో స్థానికులు, ఔత్సహికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
News October 31, 2025
BRS కేడర్‌కు నవీన్ యాదవ్ వార్నింగ్.. ECకి ఫిర్యాదు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని BRS ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. వారం రోజుల్లో బీఆర్ఎస్ కేడర్‌ను లేకుండా చేస్తానని నవీన్ యాదవ్ చేసిన బెదిరింపు వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్, కిషోర్ గౌడ్ తదితరులు ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు.
News October 31, 2025
అజ్జూ భాయ్ ప్రమాణం.. అందరి చూపు ఈసీ వైపు!

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ నేత అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తోందని బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో నేడు ఆయన ప్రమాణ స్వీకారంపై సందిగ్ధం నెలకొంది. అయితే మ.12.15 గం.కు ఆయన ప్రమాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో ఏం సమాధానం వస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.


