News October 31, 2025

కొండాపూర్ కల్వర్టు మరమ్మతు పూర్తి చేయాలి: కలెక్టర్

image

కోనరావుపేట మండలంలోని కొండాపూర్ శివారులో పెంటివాగు ప్రవహించడంతో దెబ్బతిన్న లో లెవెల్ కల్వర్టును ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ గురువారం పరిశీలించారు. కల్వర్టుకు పక్కాగా మరమ్మతులు పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరించాలని ఆమె ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. మరమ్మతులు వేగవంతం చేసి, ప్రజల ఇబ్బందులు తొలగించాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News November 1, 2025

ఈ కోళ్లు రోజూ గుడ్లు పెడతాయని తెలుసా?

image

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలం. ఏడాదిలో 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18-20 వారాల పాటు పెంచిన తర్వాత అవి గోధుమ రంగులో పెద్ద గుడ్లను పెడతాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు. ✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News November 1, 2025

పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా? థైరాయిడ్ కావొచ్చు

image

ప్రస్తుతం థైరాయిడ్ వ్యాధి పిల్లలకు కూడా వస్తోంది. పిల్లల్లో ఈ సమస్యను నివారించాలంటే లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. పిల్లలు అలసిపోయినట్లు అనిపించడం, తరచూ అనారోగ్యానికి గురికావడం, చర్మం, పొడిగా, నిర్జీవంగా మారడం, మలబద్ధకం, అజీర్ణం, థైరాయిడ్ గ్రంధి పరిమాణం పెరగడం, కళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

News November 1, 2025

రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక

image

వాల్మీకిపురం మండలం కొత్త మంచూరు ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి నెట్ బాల్ సెలక్షన్స్‌లో మదనపల్లె విద్యార్థి సత్తాచాటాడు. U-17 విభాగం నెట్ బాల్ పోటీల్లో మదనపల్లెలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థి వెంకట విశ్వ సాయి ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని పీడీ రెడ్డి వరప్రసాద్ శుక్రవారం తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థిని హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.