News October 31, 2025
దండేపల్లి: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

దండేపల్లి మండలం గూడెం శివారులో ఉన్న గోదావరి నదిలో దూకి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దండేపల్లి ఎస్ఐ తహిసొద్దీన్ తెలిపారు. హాజీపూర్ మండలంలోని కర్ణ మామిడికి చెందిన గోళ్ల రవీందర్ ఆరోగ్యం క్షీణించి మానసిక పరిస్థితి సరిగ్గా లేక జీవితంపై విరక్తితో గురువారం గూడెం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. రవీందర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Similar News
News October 31, 2025
శ్రీను హత్యకు ఆ ఆడియోనే కారణమా!

అమలాపురం(M) కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను హత్యకు ఫోన్ కాల్ ఆడియోనే కారణమా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గంగుమళ్ళ కాసుబాబుతో శ్రీను మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మృతుడు శ్రీను, కాసుబాబు మధ్య జరిగిన వ్యక్తిగత దూషణలు, ఆ ఆడియో వేరే వాళ్లకు పంపడం హత్యకు దారితీశాయని అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల ఇందుకు మూలంగా భావిస్తున్నారు.
News October 31, 2025
నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన

TG: రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావం దాదాపుగా ముగిసినట్లేనని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇవాళ మాత్రం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.
News October 31, 2025
సిద్దిపేట: వాగులో దంపతుల మృతదేహాలు లభ్యం

అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగులో వరద ప్రవాహానికి HNK జిల్లా భీమదేవరపల్లికి చెందిన <<18150389>>దంపతులు<<>> ఈసంపల్లి ప్రణయ్(28), కల్పన(24) గల్లంతైన విషయంతెలిసిందే. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఇవాళ ఉదయం ప్రణయ్, కల్పన మృతదేహాలను గుర్తించారు. కాగా మృతదేహాలను పట్టుకొని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


