News April 10, 2024
దువ్వాడ మీదుగా ప్రత్యేక రైలు

హైదరాబాద్-కటక్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ అధికారి ఏ.కె త్రిపాఠి తెలిపారు. 07165 నంబర్ గల హైదరాబాద్-కటక్ ప్రత్యేక రైలు ఏప్రిల్ 16,23,30 తేదీల్లో ప్రతి మంగళవారం రాత్రి 8:10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 9.05 దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 9.07 బయలుదేరి సాయంత్రం 5.45 కటక్ చేరుకుంటుంది. కటక్‌లో 17,24, మే1న 07166 నంబర్ గల రైలు అందుబాటులో ఉంటుందన్నారు.
Similar News
News April 8, 2025
మధురవాడ: కడుపు నొప్పి తాళలేక ఉరి వేసుకుని మృతి

కడుపునొప్పి తాళలేక ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం గ్రామానికి చెందిన చిత్తులూరి అప్పారావు(32) మధురవాడ రెవెన్యూ కాలనీలో నివాసం ఉంటూ ఓ హోటల్లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. సోమవారం కడుపునొప్పి తాళలేక ఉరి వేసుకున్నట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు. మృతుడు వదిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News April 8, 2025
విశాఖ: నేడు జూ పార్క్‌ను సందర్శించనున్న డిప్యూటీ సీఎం

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజులు విశాఖ పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం విశాఖ జూ పార్క్‌కు రానున్నారు. ఈ మేరకు జూ పార్కు క్యూరేటర్ మంగమ్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడ జరిగే ఎకో టూరిజం మీటింగ్‌లో పవన్ కళ్యాన్ పాల్గొంటారని చెప్పారు.
News April 8, 2025
విశాఖ: ‘జేఈఈ పరీక్షకు విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలి’

జేఈఈ పరీక్షకు ట్రాఫిక్ అంతరాయం వలన ఆలస్యంగా వెళ్లిన 30 మంది విద్యార్థులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అవకాశం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు.నాగరాజు విజ్ఞప్తి చేశారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పెందుర్తి రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో జేఈఈ పరీక్షకు వెళ్లాల్సిన విద్యార్థులు ట్రాఫిక్ వలన హాజరు కాలేకపోయారని వీరందరికీ అవకాశం కల్పించాలని కోరారు.