News October 31, 2025

వరంగల్: ఎస్ఏ పరీక్షలు వాయిదా!

image

వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఎస్ఏ పరీక్షలను వాయిదా వేసినట్లు డీఈవోలు రంగయ్య, వాసంతి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా గురు, శుక్ర, శని వారాల్లో నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేశామని ఎప్పుడు నిర్వహించేది శనివారం వెల్లడిస్తామని రంగయ్య తెలిపారు. వర్షాల కారణంగా వాయిదా వేసిన పరీక్షలను సోమ, మంగళ, బుధవారాల్లో నిర్వహిస్తామని HNK DEO వాసంతి తెలిపారు.

Similar News

News October 31, 2025

MBNR: U-14, 17 కరాటే.. 4న ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్-14, 17 విభాగంలో కరాటే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్సీఎఫ్ కార్యదర్శి Dr.ఆర్.శారదాబాయి Way2Newsతో తెలిపారు. నవంబర్ 4న మహబూబ్ నగర్‌లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్‌లో ఎంపికలు నిర్వహిస్తామని, అండర్-14 విభాగంలో 1.1.2012లో, అండర్-17 విభాగంలో 1.1.2009 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని, ఆసక్తిగల బాల, బాలికలు పీడీ నరసింహను (94928 94606) సంప్రదించాలన్నారు.

News October 31, 2025

డాక్టర్స్ స్పెషల్: ఎల్బీస్టేడియంలో టెన్నిస్ టోర్నమెంట్

image

ఎప్పుడూ రోగులు, వైద్యం అంటూ బిజీ బిజీగా ఉండే వైద్యులు ఈ వీకెండ్ సేదతీరనున్నారు. టెన్నిస్ టోర్నమెంటులో పాల్గొని రిలాక్స్ కానున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు డాక్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డా.అర్జున్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్యులు సందడి చేయనున్నారు. 

News October 31, 2025

HYD: రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట జరుగకుండా చర్యలు

image

పండగలు, ప్రత్యేక రోజుల్లో సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఒక్కోసారి రద్దీ ఎక్కువై అదుపుతప్పి తొక్కిసలాట జరుగుతుంది. ఈ ప్రమాదాలు జరుగకుండా రైల్వే శాఖ కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు హోల్డింగ్ ఏరియాలను త్వరలో ఏర్పాటు చేయనుంది. ఇవి అందుబాటులోకి వస్తే తోసుకోవడం, తొక్కిసలాట సమస్యలు ఉండవని అధికారులు చెబుతున్నారు.