News April 10, 2024

ఎవరెక్కువ అబద్ధాలు చెబుతున్నారంటే?

image

ఆడవారికంటే మగవారే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నట్లు బ్రిటన్‌లో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. మహిళలు ఏడాదికి సగటున 728 అబద్ధాలు చెబితే.. పురుషులు ఏకంగా 1,092 అబద్ధాలు ఆడుతున్నారట. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో కంటే నేరుగా కలిసినప్పుడు మరిన్ని అబద్ధాలు చెబుతున్నారట. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి?

Similar News

News October 10, 2024

TEAM INDIA: మనల్ని ఎవడ్రా ఆపేది!

image

ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ టీమ్ ఇండియాకు ఎదురే లేకుండా పోయింది. అటు టెస్టుల్లో, ఇటు టీ20ల్లో వరుస విజయాలు సాధిస్తోంది. ఈ ఏడాది 8 టెస్టులు ఆడగా ఒక్క మ్యాచ్‌లోనే ఓడి ఏడింట్లో జయకేతనం ఎగరేసింది. మరోవైపు 21 టీ20లు ఆడి ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓటమి పాలైంది. కాగా ఈ ఏడాది భారత్ 3 వన్డేలే ఆడినా రెండిట్లో ఓడి ఒకటి టై చేసుకుంది. అటు టెస్టుల్లో రోహిత్ శర్మ, ఇటు టీ20ల్లో సూర్యకుమార్ సారథ్యంలో భారత్ దూసుకుపోతోంది.

News October 10, 2024

మోపిదేవి పార్టీ మారడం బాధాకరం: జగన్

image

AP: రేపల్లె నియోజకవర్గ నేత మోపిదేవి వెంకట రమణ పార్టీ వీడటంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఆయన విషయంలో ఏనాడు తప్పు చేయలేదని, మోపిదేవి పార్టీ మారడం బాధాకరమని అన్నారు. మండలి రద్దు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మోపిదేవిని రాజ్యసభకు పంపామని గుర్తు చేశారు. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని అన్నారు. తనను జైల్లో పెట్టినా ప్రజల ఆశీర్వాదంతో సీఎం అయ్యానని వ్యాఖ్యానించారు. దేవుడు మంచివైపు ఉంటాడని చెప్పారు.

News October 10, 2024

సైలెంట్‌గా ఉన్నందుకు క్షమించండి: షకీబ్

image

బంగ్లా మాజీ PM హసీనాకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు తాను మద్దతుగా నిలవనందుకు క్షమించాలని ఆ దేశ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఫ్యాన్స్‌ను కోరారు. ఈ నెల 21న ఢాకాలో సౌతాఫ్రికాతో జరిగే తన ఆఖరి టెస్టుకు పెద్ద ఎత్తున రావాలని విజ్ఞప్తి చేశారు. ‘నియంతృత్వ వ్యతిరేక నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నా ప్రగాఢ సంతాపం’ అని పేర్కొన్నారు. హసీనా పార్టీ తరఫునే ఆయన ఎంపీ కావడం గమనార్హం.