News October 31, 2025
బాహుబలి యూనివర్స్‌లో కొత్త సినిమా ప్రకటన

బాహుబలి యూనివర్స్‌లో ‘బాహుబలి-ది ఎటర్నల్ వార్’ పేరిట 3D యానిమేటెడ్ మూవీ రాబోతోంది. ‘బాహుబలి-ది ఎపిక్’ సినిమా చివర్లో ఈ 3D మూవీ టీజర్‌ను థియేటర్లలో ప్లే చేశారు. 2027లో తొలి పార్ట్ రిలీజ్ కానుంది. కొత్త కథతో రూ.120కోట్ల బడ్జెట్‌తో దీనిని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి సమర్పణలో ఇషాన్ శుక్లా తెరకెక్కించనున్నారు. ఇందులో ఇంద్రుడు, బాహుబలి మధ్య యుద్ధాన్ని చూపిస్తారని తెలుస్తోంది.
Similar News
News October 31, 2025
విడిపోతున్నారా? పిల్లలు జాగ్రత్త

దంపతులు తమ విడాకుల విషయాన్ని చెబితే పిల్లలు ఎంతోకొంత ఒత్తిడికి గురవడం సహజం. కొందరు చిన్నారులు పరిస్థితుల్ని త్వరగా అర్థం చేసుకుంటే.. మరికొందరికి సమయం పడుతుంది. కాబట్టి త్వరగా అర్థం చేసుకోమని, మారమని వారిపై ఒత్తిడి తీసుకురాకూడదు. ఆయా పరిస్థితులకు తగినట్లుగా అడ్జస్ట్ అయ్యే వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే వారు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే ఓర్పు, నేర్పు వస్తుందంటున్నారు నిపుణులు.
News October 31, 2025
ఆస్పత్రికి వచ్చిన అరగంటలోపే వైద్య సేవలు

AP: రోగులకు సేవలందించడంలో వైద్య శాఖ మరో ముందడుగు వేసింది. ఆస్పత్రికి వచ్చిన 26 ని.లోనే వైద్యం అందిస్తోంది. గతంలో ఈ టైమ్ 42ని.గా ఉండేది. గత 6నెలల్లో 4కోట్ల మందికి పైగా OP సేవలందుకున్నారు. డాక్టర్లు, సిబ్బంది హాజరు 83% నుంచి 92%కి పెరిగింది. VSP KGH, KRNL, RJY GGHలు అగ్రస్థానంలో ఉన్నాయి. APR-SEP వరకు వైద్యశాఖ పనితీరు రిపోర్టులను మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షించారు. వాటిని బట్టి ర్యాంకులు ఇస్తారు.
News October 31, 2025
చొరబాటుదారుల్ని వెనక్కి పంపిస్తాం: మోదీ

దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారందరినీ వెనక్కి పంపిస్తామని PM మోదీ పునరుద్ఘాటించారు. చొరబాట్లు దేశ ఐక్యతకు ముప్పుగా మారుతాయని, గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. చొరబాట్లను అడ్డుకొనే వారికి అడ్డుపడుతూ కొన్ని పార్టీలు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు. ‘దేశ భద్రతకు రిస్క్ ఏర్పడితే ప్రతి పౌరుడు ప్రమాదంలో పడినట్లే’ అని ‘ఏక్తాదివస్’లో PM హెచ్చరించారు.


