News October 31, 2025
FLASH.. FLASH.. హనుమకొండ: పెళ్లి వాహనానికి యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

హనుమకొండ(D)భీమదేవరపల్లి(M) ముల్కనూర్ PS పరిధి గోపాలపురం దగ్గర ఈరోజు తెల్లవారుజామున 2.20 గంటలకు యాక్సిడెంట్ జరిగింది. మహబూబాబాద్(D) కురవి(M) సైదాపురం గ్రామానికి చెందిన 21మంది నల్లపూసల తంతు ముగించుకుని పెళ్లి వాహనం (బొలేరో)లో సిద్దిపేట నుంచి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో గోపాలపురం దగ్గర వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.ముగ్గురు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. వారిని వరంగల్ MGMకు అంబులెన్స్‌లో తరలించారు.
Similar News
News October 31, 2025
బాదేపల్లి మార్కెట్‌లో పంట ధరలు

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం మొక్కజొన్న 2,695 క్వింటాళ్లు అమ్మకానికి వచ్చింది. క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.2,007, కనిష్ఠ ధర రూ.1,600 పలికింది. ఆర్‌ఎన్‌ఆర్ వడ్లు 130 క్వింటాళ్లు రాగా, గరిష్ఠ ధర రూ.2,089, కనిష్ఠ ధర రూ.1,739గా నమోదైంది. జొన్నలు క్వింటాలుకు గరిష్ఠంగా రూ.1,701, రాగులు క్వింటాలుకు గరిష్ఠంగా రూ.3,777 లభించాయి.
News October 31, 2025
ఫైనల్లో వర్షం పడితే..?

ఆదివారం భారత్-సౌతాఫ్రికా మధ్య ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచుకు 63% వర్షం ముప్పు ఉందని IMD తెలిపింది. ఎల్లుండి మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం నిర్వహిస్తారు. ఆ రోజు కూడా వాన కారణంగా మ్యాచ్ జరగకపోతే గ్రూప్ స్టేజీలో టాప్‌లో నిలిచిన సౌతాఫ్రికానే విజేతగా ప్రకటిస్తారు. దీంతో వర్షం పడొద్దని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
News October 31, 2025
RSSను బ్యాన్ చేయాల్సిందే: ఖర్గే

దేశంలో లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టిస్తున్నందుకు RSSను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, ఇందిరా గాంధీ 41వ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐరన్ మ్యాన్, ఐరన్ లేడీ ఇద్దరూ భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం పని చేశారని చెప్పారు. దేశంలో చాలా సమస్యలకు BJP-RSSనే కారణమని ఆరోపించారు. 1948లో గాంధీ హత్య తర్వాత RSSను పటేల్ నిషేధించారని చెప్పారు.


