News October 31, 2025
వీపనగండ్ల: మైనర్ బాలికకు నిశ్చితార్థం: నలుగురిపై కేసు

వీపనగండ్ల మండలంలో 15 ఏళ్ల మైనర్ బాలికకు నిశ్చితార్థం జరిపించినందుకు పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు గురువారం చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మాయి తల్లి, అబ్బాయి, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాణి తెలిపారు. మైనర్‌ను వివాహమాడిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
Similar News
News October 31, 2025
భారత్‌లో టెస్లా, స్టార్‌లింక్ నియామకాలు

ఎలాన్ మస్క్‌కు చెందిన EV కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించే ‘స్టార్‌లింక్’ భారత్‌లో ఉద్యోగ నియామకాలు ప్రారంభించాయి. ముంబై, పుణే, ఢిల్లీ కేంద్రంగా పనిచేసేందుకు నిపుణుల కోసం టెస్లా ప్రకటన ఇచ్చింది. ఇందులో సప్లై చైన్, బిజినెస్ సపోర్ట్, AI, HR తదితర విభాగాలున్నాయి. అలాగే ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని, బెంగళూరులో పనిచేయాలని స్టార్‌లింక్ పేర్కొంది.
News October 31, 2025
భాగస్వామ్య సదస్సు విజయవంతంపై కలెక్టర్ సమీక్ష

విశాఖలో ఈ నెల 14,15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. AU ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే ఈ సదస్సును అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని విజయవంతం చేయాలని ఆదేశించారు. నగర సుందరీకరణ, అతిథుల వసతి, భద్రత, రాకపోకలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News October 31, 2025
‘దేశ ఐక్యత, సమగ్రతకు పటేల్ కృషి చిరస్మరణీయం’

దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య పాల్గొన్నారు.


