News April 10, 2024

నల్గొండ: రెండు తలల గొర్రె పిల్ల జననం 

image

తిప్పర్తి మండలంలోనీ అనిశెట్టి దుప్పలపల్లికి చెందిన కన్నెబోయిన చెన్నయ్య గొర్రెల మందలోని ఓ గొర్రె మంగళవారం సాయంత్రం రెండు తలలతో గొర్రె పిల్లకి జన్మనిచ్చింది. వింత ఆకారంలో జన్మించిన గొర్రె పిల్లను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చాారు. జన్యుపరమైన లోపంతో ఇలా జరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు. 

Similar News

News March 3, 2026

NLG: రైతులకు గుడ్ న్యూస్.. ఉగాది తర్వాతే..!

image

జిల్లాలో యాసంగి (రబీ) సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియకు యంత్రాంగం సిద్ధమవుతోంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ ముగిసిన వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ధాన్యం సేకరణపై జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ యాసంగిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 4.91 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు.

News March 3, 2026

నల్గొండ: రిజిస్ట్రేషన్ల శాఖలో ‘ఇన్‌ఛార్జీ’ల రాజ్యం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రిజిస్ట్రేషన్ల శాఖలో పాలన అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని 15 కార్యాలయాల్లో సగానికి పైగా చోట్ల రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేరు. మునుపెన్నడూ లేని విధంగా సిబ్బంది కొరత రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సీనియర్ అసిస్టెంట్లే ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు డీఆర్‌లు సైతం ఎఫ్ఏసీలే కావడం గమనార్హం.

News March 2, 2026

NLG: ఇంటర్ పరీక్షల్లో ఇవాళ 441 మంది డుమ్మా!

image

జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 441 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 12,758, మంది విద్యార్థులకు గాను 12455 మంది హాజరుకాగా, 303 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1964 మంది విద్యార్థులకు గాను 1826 మంది హాజరుకాగా, 138 మంది గైర్హాజరయ్యారు.