News April 10, 2024

పటాన్‌చెరు: పెళ్లి బట్టలకు వచ్చి యువతి MISSING

image

ఓ యువతి అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణఖేడ్‌కు చెందిన యువతకి పెళ్లి కుదరడంతో బట్టలు, ఇతర సామగ్రి కొనేందుకు ముత్తంగిలో బంధువుల ఇంటికి వచ్చింది. షాపింగ్ అనంతరం ఆ యువతిని బంధువులు ఖేడ్ బస్సు ఎక్కించగా ఆమె ఇంటికి వెళ్లలేదు. తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News September 10, 2025

మెదక్: చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన కలెక్టర్

image

మెదక్ కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి జరిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

News September 10, 2025

మెదక్: విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

image

చేగుంట మండలం చిటోజిపల్లికి చెందిన తలారి గోవర్ధన్(32) అనే యువ రైతు పొలంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య తలారి స్వప్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 10, 2025

నర్సాపూర్: తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్.. కేసు నమోదు

image

పిల్లలను ఆసుపత్రిలో చూపించడానికి వెళ్లిన తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నారాయణపూర్‌కు చెందిన వివాహిత తన ఇద్దరు పిల్లలను మంగళవారం ఆస్పత్రిలో చూపించడానికి వెళ్లి కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.