News October 31, 2025
అమలాపురం: విద్యార్థులకు అరుదైన అవకాశం

‘స్పేస్ వీక్ సైన్స్ ఎక్స్‌పోజర్ అండ్ ఎడ్యుకేషన్ టు ఢిల్లీ’ కార్యక్రమానికి అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థినులు ఎంపికయ్యారని డీఈవో షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లా విద్యార్థినులు ఈ అరుదైన అవకాశం దక్కించుకోవడం అభినందనీయమన్నారు. పైడి కొండల రాజేశ్వరి, రాచకొండ సృజన, జ్ఞానపూర్ణ దేవి దీక్షిత, ఎంహెచ్ఎస్ వి అనూష ఎంపికైన వారిలో ఉన్నారని డీఈవో వెల్లడించారు.
Similar News
News October 31, 2025
MGB, NDAలకు కీలకంగా మారిన ‘బిహార్ వార్’

బిహార్‌లో ప్రధాన కూటములు పోటాపోటీ హామీలు గుప్పించాయి. ‘తేజస్వీ ప్రాణ్’ పేరిట MGB ‘సంపూర్ణ బిహార్ కా సంపూర్ణ పరివర్తన్’ నినాదంతో స్టేట్ రూపురేఖలు మారుస్తామంది. గత ప్రభుత్వ అవినీతిని నిర్మూలిస్తామని చెప్పింది. NDA ‘సంకల్ప్ పాత్ర్’ పేరుతో రాష్ట్రాన్ని పారిశ్రామిక, విద్యా కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చింది. ఈ ఎన్నికలు అక్కడి పాలనా పగ్గాల కోసమే కాక హిందీ బెల్టులో పాగా వేసేందుకు కీలకం కావడమే కారణం.
News October 31, 2025
చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకో: జోగి రమేశ్

నారా లోకేశ్, చంద్రబాబులను ప్రశ్నించినందుకు తనపై దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి జోగి రమేశ్ ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బయటపెట్టానని తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేశానన్నారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చట్టాన్ని, వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.
News October 31, 2025
ఇతిహాసాలు క్విజ్ – 52 సమాధానాలు

1. జనకుని భార్య పేరు ‘సునయన’.
2. మహాభారతంలో రాధేయుడు ‘కృష్ణుడు’.
3. దత్తాత్రేయుడికి ‘24’ మంది గురువులు ఉన్నారు.
4. దేవతలకు వైద్యుడు ‘ధన్వంతరి’.
5. సముద్ర మథనంలో లక్ష్మీదేవికి ముందు పుట్టిన ఆమె అక్క పేరు ‘అలక్ష్మి’. ఆమెనే ‘జ్యేష్టా దేవి’ అని కూడా అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>> 


