News October 31, 2025

నేటి నుంచి యథావిధిగా పాఠశాలలు తెరవాలి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో పాఠశాలలను శుక్రవారం నుంచి యథావిధిగా తెరవాలని కలక్టర్ విజయ్‌కృష్ణన్ ఆదేశించారు. పాఠశాలల శానిటేషన్, క్లోరినేషన్ విషయంలో శ్రద్ద తీసుకొవాలాన్నారు. విద్యార్థుల భద్రతకు టీచర్స్ అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. విద్యార్థులు కాల్వలు, రోడ్డు దాటేతప్పుడు పేరెంట్స్ తగుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరెంట్ స్తంబాలు, నీటికుంటలు దగ్గరకు విద్యార్థులు వెళ్లకుండా చూడాలన్నారు.

Similar News

News October 31, 2025

కేంద్ర సాయం వెంటనే అందేలా చూడాలి: CBN

image

AP: రైతులు నష్టపోకుండా పంటలను నీటి ముంపు నుంచి కాపాడాలని CM CBN అధికారులను ఆదేశించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ముంపు ప్రాంతాలను గుర్తించి శనివారం నాటికల్లా నీటిని మళ్లించాలని సూచించారు. పంట నష్టం ప్రాథమిక అంచనాల్ని తక్షణం రూపొందించాలన్నారు. కేంద్ర బృందాల్ని రప్పించి, అక్కడి నుంచి సాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో బాగా పనిచేసిన 100 మందిని సత్కరించాలని చెప్పారు.

News October 31, 2025

భద్రకాళి అమ్మారిని దర్శించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ

image

వరంగల్ కొంగు బంగారమైన భద్రకాళి అమ్మవారిని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

News October 31, 2025

నరసాపురం: సినీ గాయకుడు రాజు కన్నుమూత

image

నరసాపురం మండలం చిట్టవరానికి చెందిన ప్రముఖ సినీ గాయకుడు గోగులమండల రాజు (42) శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. ‘పాడుతా తీయగా’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆయన, హీరో వెంకటేశ్ నటించిన ‘లక్ష్మి’ చిత్రంలోని “తార తలుకు తార” పాటతో మంచి గుర్తింపు పొందారు. ఆయన అంత్యక్రియలు శనివారం చిట్టవరంలో జరగనున్నాయి.