News April 10, 2024

విశాఖ బీచ్ రోడ్డులో ఇద్దరు యువకులు మృతి..!

image

విశాఖలోని తొట్లకొండ బీచ్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళుతూ.. రెండు బైక్‌లు ఎదురు ఎదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలైన మరో ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఘటనకు సంబంధిచి మరన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 7, 2026

విశాఖ: పన్నులు చెల్లించకుంటే జప్తే

image

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జీవీఎంసీ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. రూ.650 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మొండి బకాయిదారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,36,149 మంది బకాయిదారులను గుర్తించి, 1,10,136 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నీటి పన్ను చెల్లించని 62,290 మందికి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రూ.458.9 కోట్లు వసూలు కాగా, రూ.188.20 కోట్లు రావాల్సి ఉంది.

News March 6, 2026

స్టడీ టూర్‌కు పట్టుబడుతున్న జీవీఎంసీ కార్పొరేటర్లు

image

విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మరోసారి స్టడీ టూర్ నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కనీసం ఒక్కసారి అధ్యయన యాత్రకు అనుమతి ఇవ్వాలని మేయర్, కమిషనర్‌ను కోరుతున్నారు. ఐదేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు మాత్రమే యాత్రలు జరిగాయని, ఒక సంవత్సరం మిగిలిపోయిందని వారు చెబుతున్నారు. ఈనెల 10 నుంచి 14 వరకు టూర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.