News October 31, 2025

ఐక్యత శిల్పి.. పటేల్ జ్ఞాపకాల్లో వరంగల్ చరిత్ర..!

image

భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కి వరంగల్ జిల్లాతో విశేష అనుబంధం ఉంది. 1948లో హైదరాబాద్ రాష్ట్ర విమోచన కోసం ఆయన ఆదేశాలపై ప్రారంభమైన ‘ఆపరేషన్ పొలో’ సమయంలో భారత సైన్యం వరంగల్ మార్గంగా ప్రవేశించి రజాకారులను తరిమికొట్టింది. పటేల్ దృఢనిశ్చయంతో వరంగల్ సహా తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో విలీనమవ్వడంతో ప్రజలు నిజమైన స్వేచ్ఛా వాయులను పీల్చుకున్నారు.

Similar News

News October 31, 2025

తెలంగాణలో IASల బదిలీ

image

*అభివృద్ధి, సంక్షేమ పథకాల స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా సవ్యసాచి ఘోష్
*గురుకుల సంక్షేమ కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు
*రవాణా శాఖ కమిషనర్‌గా ఇలంబర్తి
*జీఏడీ పొలిటికల్‌ ఇన్‌ఛార్జ్‌ సెక్రటరీగా E.శ్రీధర్‌
*ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా యాస్మిన్‌ బాషా
*మెట్రోపాలిటన్‌ ఏరియా, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ఛార్జ్‌ సెక్రటరీగా సీఎస్‌ రామకృష్ణారావుకు అదనపు బాధ్యతలు

News October 31, 2025

కేంద్ర సాయం వెంటనే అందేలా చూడాలి: CBN

image

AP: రైతులు నష్టపోకుండా పంటలను నీటి ముంపు నుంచి కాపాడాలని CM CBN అధికారులను ఆదేశించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ముంపు ప్రాంతాలను గుర్తించి శనివారం నాటికల్లా నీటిని మళ్లించాలని సూచించారు. పంట నష్టం ప్రాథమిక అంచనాల్ని తక్షణం రూపొందించాలన్నారు. కేంద్ర బృందాల్ని రప్పించి, అక్కడి నుంచి సాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో బాగా పనిచేసిన 100 మందిని సత్కరించాలని చెప్పారు.

News October 31, 2025

భద్రకాళి అమ్మారిని దర్శించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ

image

వరంగల్ కొంగు బంగారమైన భద్రకాళి అమ్మవారిని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు, అధికారులు పాల్గొన్నారు.