News October 31, 2025
GNT: తెలుగులో ఏపీ రాజకీయ చరిత్ర రచించిన గొప్ప వ్యక్తి

రాజకీయ, సాంఘిక, తాత్విక రచనలు తెలుగులో రచించిన నరిశెట్టి ఇన్నయ్య 1937, అక్టోబర్ 31న చేబ్రోలు శివారు పాతరెడ్డిపాలెంలో జన్మించారు. ప్రముఖ హ్యూమనిస్ట్ ఎం.ఎన్. రాయ్ రచనలు ఆయన తెలుగులో అనువదించగా, తెలుగు అకాడమీ వీటిని ప్రచురించింది. తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించారు. ఈయన జాతీయ హేతువాద సంఘంకి కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1954 నుంచి పదేళ్ల పాటు “ప్రజావాణి” పత్రికలో పనిచేశారు.
Similar News
News October 31, 2025
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) ఆస్పత్రిలో చేరారు. మెడికల్ చెకప్ కోసం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు ఇండియా టుడే తెలిపింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది. కాగా ఏప్రిల్‌లో ధర్మేంద్ర కంటికి సర్జరీ జరిగింది. ఈ దిగ్గజ నటుడు షోలే, చుప్కే చుప్కే, అనుపమ, సీతా ఔర్ గీతా, ధర్మవీర్, జీవన్ మృత్యు లాంటి 300కు పైగా సినిమాల్లో నటించారు.
News October 31, 2025
కండలేరుకు నిధులు ఇవ్వాలని వినతి

కండలేరులో 11 కిలోమీటర్ల మేర కట్ట నిర్మించి 30 ఏళ్లు అవుతోంది. దీన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ తెలిపారు. డ్యాం సాధారణ మెయింటెనెన్స్‌కు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావుకు ఆయన వినతిపత్రం అంందజేశారు.
News October 31, 2025
బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా నుంచి రక్షించాలి: కవిత

చారిత్రాత్మక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కోరారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె శుక్రవారం బొమ్మలమ్మగుట్టను సందర్శించారు. ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కన్నుపడిందన్నారు. సొంత ఖజానా నింపుకోవడానికి గుట్టను విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. భవిష్యత్ తరాల కోసం గుట్టను రక్షించుకోవాలన్నారు.


