News October 31, 2025
నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదనే నమ్ముతా: ఉప రాష్ట్రపతి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని దేవర్ చెప్పినట్లు ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ పేర్కొన్నారు. తమిళనాడులోని పసుంపొన్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు ముత్తురామలింగ దేవర్ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. “నేతాజీకి దేవర్ బలమైన మద్దతుదారుడు. ఆయన జీవితంలో అబద్ధం ఆడలేదు. ‘నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు. నేను ఆయన్ను కలిశాను’ అని దేవర్ చెప్పారు. నేను అదే నమ్ముతాను” అని తెలిపారు.
Similar News
News October 31, 2025
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) ఆస్పత్రిలో చేరారు. మెడికల్ చెకప్ కోసం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు ఇండియా టుడే తెలిపింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది. కాగా ఏప్రిల్‌లో ధర్మేంద్ర కంటికి సర్జరీ జరిగింది. ఈ దిగ్గజ నటుడు షోలే, చుప్కే చుప్కే, అనుపమ, సీతా ఔర్ గీతా, ధర్మవీర్, జీవన్ మృత్యు లాంటి 300కు పైగా సినిమాల్లో నటించారు.
News October 31, 2025
కాఫీ/ టీ తాగే అలవాటు ఉందా?

ఎంతోమందికి ఇష్టమైన కాఫీ, టీలు ఆరోగ్య ప్రయోజనాలను అందించినప్పటికీ వాటిలో ఉండే ‘టాన్సిన్స్’ రసాయనాలు దంతాల రంగును మారుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి దంతాల ఎనామిల్‌పై పేరుకుపోయి కాలక్రమేణా పసుపు లేదా గోధుమ రంగు మరకలకు కారణమవుతాయని చెబుతున్నారు. కాఫీ కంటే టీ తాగేవారికే ఎక్కువ ప్రమాదమని తెలిపారు. అందుకే టీ/కాఫీ తాగాక పుక్కిలించడం లేదా 30 నిమిషాల తర్వాత బ్రష్ చేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు.
News October 31, 2025
మహిళల ప్రపంచకప్: భారత్ గెలిచేసిందట!

మహిళల ODI వరల్డ్‌కప్‌ను టీమ్ ఇండియా గెలిచేసిందంటూ ‘వికీపీడియా’ చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ‘50 ఓవర్లలో ఇండియా 326-5 రన్స్ చేసింది. సౌతాఫ్రికా 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయింది’ అని సైట్‌లో కనిపించింది. వికీపీడియాలో ఎవరైనా మార్పులు చేయగలిగే ఓపెన్ ఎడిటింగ్ పాలసీ వల్ల ఇలా జరిగిందని తెలుస్తోంది. తర్వాత సరిదిద్దినట్లు సమాచారం. నవంబర్ 2న సౌతాఫ్రికా, భారత్ మధ్య నవీ ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.


