News October 31, 2025

నిన్నటి దాకా తుఫాన్.. ఇప్పుడు కృష్ణా నదికి వరద

image

నిన్నటివరకు తుఫాన్ కష్టాలు ఎదుర్కొన్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఇప్పుడు వరదల నేపథ్యంలో భయాందోళనలో ఉన్నారు. ప్రకాశం బరేజ్‌కు భారీగా నీటి ప్రవాహం చేరడంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఆందోళనలో గురవుతున్నారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే పంటలు దెబ్బతినగా, ఇప్పుడు కృష్ణా నదికి వరద పెరగడంతో, ఈసారి పంట పరిస్థితి ఎలా ఉండబోతుందో అని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Similar News

News October 31, 2025

వరకట్న నిషేధ చట్టంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

వరకట్న నిషేధ చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. వరకట్న నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. యువతలో ఎక్కువగా అవగాహన కల్పించాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

News October 31, 2025

పెదకాకాని మండలం తెనాలి డివిజన్‌లోకి.?

image

జిల్లా పునర్విభజనపై క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ప్రకారం పెదకాకాని మండలం తెనాలి రెవెన్యూ డివిజన్‌లోకి మారే అవకాశం ఉందని సమాచారం. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే డివిజన్‌లో ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనతో ఈ మార్పు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గం గుంటూరు, తెనాలి డివిజన్‌లలో విభజింపబడి ఉండటంతో పెదకాకాని మార్పుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

News October 31, 2025

గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

image

గుంటూరు మిర్చి మార్కెట్‌కు శుక్రవారం 45,000 బస్తాల మిర్చి వచ్చింది. తేజా రకం ధరలు ₹13,000 నుంచి ₹15,200 వరకు పలికాయి. అసాధారణ నాణ్యత గల డీలక్స్ రకాలు ₹15,700 వరకు అమ్ముడయ్యాయి. 341 రకం అత్యధికంగా ₹16,500 ధరను తాకింది. DD, NO-5 రకాలు కూడా డీలక్స్‌లో ₹16,000 వరకు పలికాయి. ఆర్మూర్ వంటి రకాలు ₹11,000 కనిష్టంగా నమోదయ్యాయి. పసుపు మిర్చికి నాణ్యత కొరవడింది. తేజా ఫాట్కీ ₹8,200 నుంచి ₹10,000 మధ్య పలికింది.