News October 31, 2025

అనకాపల్లి: రేపు రూ.108.8 కోట్ల పింఛన్ల పంపిణీ

image

అనకాపల్లి జిల్లా 24 మండలాల‌తో పాటు అనకాపల్లి జీవీఎంసీ, ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల పరిధిలో శనివారం లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి రూ.108.8 కోట్ల పింఛన్లు పంపిణీ చేయ‌నున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శచీదేవి తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ ఆధారంగా సొమ్ము అందజేస్తారని చెప్పారు. కొత్తగా 344 స్పౌజ్ పింఛన్లు మంజూరై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.

Similar News

News October 31, 2025

సంగారెడ్డి: పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించాలి: ఎస్పీ

image

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ పారితోష్ పంకజ్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో పెండింగ్ లో ఉన్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆన్ లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్ పై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

News October 31, 2025

పెద్దపల్లి: ‘మహాసభలను విజయవంతం చేయాలి’

image

PDPL అమరవీరుల స్థూపం వద్ద పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ మహాసభలు NOV 8, 9 తేదీల్లో HYDలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగనున్నాయి. “ఆపరేషన్ కగార్ వ్యతిరేకిద్దాం-జీవించే హక్కును కాపాడుకుందాం” అనే అంశంపై సభలు, చర్చలు, ఐక్యత సందేశాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.

News October 31, 2025

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త

image

AP: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు RTC ఆస్పత్రులతోపాటు EHS హాస్పిటల్స్‌లోనూ ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020 JAN 1 తర్వాత రిటైరైన వారికి ఈ సౌకర్యం వర్తించనుంది. సూపరింటెండెంట్ కేటగిరీ వరకు ₹38,572, అసిస్టెంట్ మేనేజర్, ఆపై ర్యాంకు ఉన్నవారు ₹51,429 ఓసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం చికిత్స పొందవచ్చు. రెగ్యులర్ ఉద్యోగుల్లా రీయింబర్స్‌మెంట్ సౌకర్యమూ ఉంటుంది.