News October 31, 2025
నేడు వరంగల్‌కు సీఎం..!

వరంగల్ నగరంలో వరద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం రానున్నారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా సీఎం ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం హనుమకొండ కలెక్టరేట్లలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం సీఎం పర్యటన ఉంటుందని అధికారులు తెలిపారు.
Similar News
News October 31, 2025
‘పహల్గామ్’ టెర్రరిస్టుల ఏరివేత.. 40 మందికి పురస్కారాలు

దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తు, ప్రత్యేక ఆపరేషన్లలో ప్రతిభ కనబర్చిన 1,466మంది ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్’ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో పహల్గామ్ ఉగ్రవాదుల ఏరివేత(ఆపరేషన్ మహాదేవ్)లో పాల్గొన్న 40మంది J&K పోలీసులు, CRPF సిబ్బంది ఉన్నారు. హోంశాఖ పరిధిలోని పురస్కారాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన కేంద్రం.. ఏటా ‘సర్దార్’ జయంతి రోజు(OCT31) దక్షతా పదక్ అవార్డులను ప్రకటిస్తోంది.
News October 31, 2025
KNR: మైనారిటీ గురుకులాల్లో లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు

జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కరీంనగర్, మానకొండూర్, జమ్మికుంట గురుకులాల్లోని ఈ పోస్టులకు PG, B.Ed అర్హత ఉన్నవారు నవంబర్ 6వ తేదీ లోగా కరీంనగర్ జిల్లా మైనారిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
News October 31, 2025
చిత్తూరు: ఉరిశిక్ష పడిన ముద్దాయిలది ఏ ఊరంటే?

A1:<<18160618>>చింటూ<<>>(55) S/O సుబ్రహ్మణ్యం
ఊరు: కన్నయ్యనాయుడు కాలనీ చిత్తూరు
A2:M.వెంకటేశ్(49) S/O మునిరత్నం
ఊరు: గంగనపల్లె
A3:కొట్టేవల్ల జయప్రకాశ్ రెడ్డి(33) S/O మునిరత్నం
ఊరు: గంగనపల్లె
A4:తోటి మంజునాథ్(37) S/O మునిచౌడప్ప
ఊరు: మారేడుపల్లి, గంగవరం(M)
A5:వెంకటచలపతి(61) S/O శ్రీనివాసయ్య,
 ఊరు:ముల్బాగల్, కర్ణాటక 


